Site icon NTV Telugu

Hyderabad Rain Effect : ఖాళీగా రైతు బ‌జార్లు.. కుళ్లుతున్న కూర‌గాయలు

Vegetable Market

Vegetable Market

హైదరాబాద్‌ లో జోరున పడుతున్న వానలకు ఆకుకూరలు, కూరగాయాలు పాడవుతున్నాయి. నగరంలోని ముసుర్లు పడుతుండటంతో.. తోటల్లోని కూరగాయలు కోసేందుకు వీలులేకుండా పోతోంది. ఈనేపథ్యంలో.. నగర మార్కెట్లకు వచ్చే కూరగాయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితి ఇంకొన్ని రోజులు వుంటే కూరగాయాల సప్లయ్‌ తగ్గి .. రేట్లు పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక వానల ప్రభావంతో.. మార్కెట్‌ లోకి ప్రతిరోజు వచ్చే కూరగాయాల కన్నా 40శాతం తక్కువగా వస్తున్నాయని, తోటలు, పొలాల్లో కూరగాయాల పంటలన్నీ నీటమునిగాయని, పంటలు కోసేందుకు కూలీలు రావట్లేదని పేర్కొన్నారు. కావున హైదరాబాద్‌ లోని రైతు బజార్లకు వచ్చే కూరగాయాల సప్లయ్‌ తగ్గుతోందని అధికారులు వెల్లడించారు.

read also: Komati Reddy Venkat Reddy: టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది

అయితే రైతు బజార్లకు కూరగాయాలను కొనేందుకు జనాలు రావడంలేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి గల కారణం ఆన్‌లైన్‌ మార్కట్‌ వల్లే నని చెబుతున్నారు. దానివల్లే తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కూడా లెక్కచేయకుండా కూరగాయలను అమ్మేందుకు వస్తున్నా.. ఎవరూ కొనేందుకు రావడం లేదని దాంతో కూరగాయాలు కుల్లిపోతున్నాయని వాపోతున్నారు. పంటను అమ్ముకునేందుకు మార్కట్‌కు వస్తే ట్రాన్స్‌ పోర్ట్‌ చార్జీలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం ప్రభావం వల్ల రైతు బజార్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వర్షం ప్రభావంతో కూరగాయాల రేట్లు ఎక్కువగా వున్నయని, కూరగాలయ క్వాలిటీ సరిగా లేదని సిటీ జనం అంటున్నారు. నగరంలో ప్రస్తుతం ఎర్రగడ్డ బజార్లో టమాట కేజీ రూ. 20, వంకాయ రూ. 23, బెండకాయ రూ 30, మిర్చి రే.45, క్యాప్సికం రూ. 50, బీరకాయ రూ.35, క్యారెట్‌ రూ.57, క్యాబేజీ రూ.18, బీన్స్‌ రూ.75 రేట్లు ఉన్నాయి.

సీజనల్ వ్యాధులకు ఈ ఆహార అలవాట్లతో చెక్ పెట్టండి

Exit mobile version