NTV Telugu Site icon

IIIT Student: ట్రిపుల్ ఐటీ విద్యార్థినిల మరణాలు.. వీసీ వెంకట రమణ క్లారిటీ

Iiit Basara

Iiit Basara

IIIT Student: బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని మృతి చెందిన ఘటన మరవకముందే మరో విద్యార్థిని లిఖిత మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ట్రిపుల్ ఐటీ లోనే విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వీసి వెంకట రమణ స్పందించారు. లిఖిత అనే విద్యార్ధిని నాల్గవ అంతస్తు పై నుంచి ప్రమాదశాత్తు పడి చనిపోయిందని తెలిపారు. లిఖిత ఫోన్ చూస్తుండగానే భవనంపై నుంచి జారిపడిందని చెప్పాడు. ప్రమాదంలో లిఖిత వీపు భాగం దెబ్బతిందని తెలిపారు. విద్యార్థుల మృతి బాధాకరమని వీసీ అన్నారు. హాస్టల్ భవనాలకు గ్రిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. తమ వంతు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

దీపికా మృతి పై ప్రాధమిక నివేదిక వచ్చిందని, దీపికా పరిక్ష హాల్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్ళిందని తెలిపారు. పరీక్ష నియమాలు పాటించాలని కౌన్సిలింగ్ కోసం పరిపాలన భవనంను తీసుకెళ్లారని అన్నారు. దీపికా వాష్ రూమ్ కి వెల్లివస్తా అని చెప్పి క్షణికావేశంలో ఉరి వేసుకుని చనిపోయిందని స్పష్టంచేశారు. డైరెక్టర్ పదవి కాలం ముగుస్తుందని, దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. డైరెక్టర్, వీసి మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీ లో కొన్ని గ్యాప్ లు ఉన్నాయని, గతం కంటే పరిస్థితి బాగా మెరుగైందన్నారు. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షా విధానంలో మార్పుల వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ స్థాయి లో సెమిస్టర్ విధానం వద్దు అనుకున్నామని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కొరకు సెమిస్టర్ విధానం ను రద్దు చేసుకున్నామని స్పష్టం చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీలో వరుస సంఘటనలు బాధాకరమని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాసరలో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలు బాధాకరమని అన్నారు. మొన్న జరిగిన పీయూసీ మెదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక మూత్రశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కమిటీ వేశామని.. విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఈ రోజు జరిగిన ఘటనలో ఇంకా పూర్తి సమాచారం లేదని అన్నారు. పూర్తి సమాచారం తెచ్చుకున్న తర్వాత మీడియా సమావేశం అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. ఏదిఏమైనా విద్యార్థులు సమన్వయం పాటించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.
Astrology : జూన్‌ 16, శుక్రవారం దినఫలాలు