NTV Telugu Site icon

V. C. Sajjanar: పాటించకపోతే మీకే నష్టం..! ప్రైవేట్‌ బ్యాంకు ఖాతాదారులకు సజ్జనార్‌ సలహా..!

Vc Sajjanar

Vc Sajjanar

V. C. Sajjanar: ప్రైవేట్‌ బ్యాంకుల ఖాతాదారులకు అలెర్ట్‌ గా ఉండాలని వీసీ సజ్జనార్ సలహా ఇచ్చారు. డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసులు ప్రైవేట్‌ బ్యాంకుల ఖాతాదారులనే ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ICICI Bank, Yes Bank, RBL Bank, IndusInd Bank, RBL Bank, IDFC First Bank, AU Small Finance Bank తో పాటు Punjab National Bank బ్యాంకుల ఖాతాదారులకు ఫోన్లు చేసి కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారని అన్నారు. సోషల్‌ మీడియా సాయంతో బ్యాంక్‌ ఏజెంట్లను నియమించుకుని.. బ్యాంకు ఖాతాల్లో ఎక్కువగా డబ్బున్న వారికి ఫోన్‌ కాల్స్‌ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. అక్రమ లావాదేవీలు చేస్తూ ఇండియన్‌ బ్యాంక్‌ ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

Read also: Breaking: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు లో ఊరట..!

కావున ప్రైవేట్‌ బ్యాంకుల ఖాతాదారులు సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ మొత్తంలో నగదు బదిలీకి బ్యాంకు కరెంట్‌ ఖాతాలను ఉపయోగించుకోవాలి. అవసరమైతేనే ఒక్కటి రెండు సార్లు ధృవీకరించుకున్నాకే కార్పొరేట్‌ లాగిన్‌ లు తెరవాలి. కార్పొరేట్‌ లాగిన్‌ల సాయంతో పెద్ద మొత్తంలో సైబర్‌ నేరగాళ్లు నగదు బదిలీ చేసే అవకాశముంది.. జాగ్రత్త! అని సూచించారు. విదేశాల నుండి ఇండియా బ్యాంక్‌ ఖాతాలకు ఇంటర్‌ నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ముఖ్యంగా చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, థాయిలాండ్‌, కంబోడియా దేశాల ఐపీ అడ్రస్‌లను బ్లాక్‌ చేయాలని తెలిపారు. డ్రగ్‌ పార్శిళ్ల పేరుతో మోసాలు ఎక్కువగా దుబాయ్‌ కేంద్రంగా పనిచేస్తోన్న కాల్‌ సెంటర్ల నుంచి జరుగుతున్నాయని అన్నారు.

Read also: Vivek Venkatswamy: తెలంగాణ ఏర్పాటుతో కేవలం ఆ కుటుంబం మాత్రమే లాభ పడింది..!

టెలిగ్రామ్‌ ద్వారా భారతీయులను రిక్రూట్‌ చేసుకుని.. వారి సాయంతో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని అన్నారు. తైవాన్‌, థాయిలాండ్‌, కంబోడియా దేశాల నుంచి డ్రగ్‌ పార్శిల్‌ ఫ్రాడ్స్‌ జరుగున్నాయన్నారు. డ్రగ్‌ పార్శిళ్ల పేరుతో ప్రపంచంలో జరుగుతున్న మొత్తం మోసాల్లో 90 శాతం భారతదేశంలోనే సంభవిస్తుండం గమనార్హం. ఈ మోసాలకు చెక్ పెట్టాలంటే స్వీయ అవగాహన కలిగిఉండటం ఒక్కటే మార్గం అన్నారు. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తే అసలే స్పందించవద్దు. పోలీసులమని అని చెప్పగానే భయపడి పోయి వారు చెప్పినట్లు చెయొద్దన్నారు. నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చెయొద్దని తెలిపారు. ఒకవేళ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సలహా ఇచ్చారు.

Aadujeevitham – The Goat Life Review: ది గోట్ లైఫ్- ఆడు జీవితం రివ్యూ

Show comments