NTV Telugu Site icon

VC Sajjanar: ప్రజల్ని మోసం చేసిన ఆ సంస్థని ప్రమోట్ చేయొద్దు.. ఐపీఎల్ యాజమాన్యంకు సజ్జనార్ రిక్వెస్ట్

Vc Sajjanar On Herbalife

Vc Sajjanar On Herbalife

VC Sajjanar Suggested IPL Management To Not Collaborate With Herbalife: సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఒక సంచలన ట్వీట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలను హెర్బల్ లైఫ్ వంటి సంస్థలు నాశనం చేస్తున్నాయని.. అలాంటి సంస్థను స్పాన్సర్‌షిప్‌గా పెట్టుకోవడం కరెక్ట్ కాదని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. హెర్బల్ లైఫ్ లాంటి గొలుగుకట్టు సంస్థలు అమాయకపు ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాయని, ఇలాంటి మోసపూరిత సంస్థలను పార్ట్‌నర్స్‌గా పెట్టుకోవద్దని సూచించారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ చేస్తూ.. ఐపీఎల్‌కు అఫీషియల్ స్పాన్సర్‌గా ఉన్నామని చెప్తూ.. ఇలాంటి సంస్థలకు మోసాలకు పాల్పడుతున్నాయని చెప్పారు. ఐపీఎల్‌ను అడ్డం పెట్టుకొని హెర్బల్ లైఫ్ తన వస్తువులను అమ్మి బురిడీ కొట్టిస్తుందని, హెర్బల్ లైఫ్ చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. హెర్బల్ లైఫ్ లాంటి సంస్థలపై విచారణ సంస్థలు కేసులు నమోదు చేసి, విచారణ జరపాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ఫోటోలు సైతం షేర్ చేశారు.

Allahabad HC: కారణం లేకుండా జీవిత భాగస్వామితో సెక్స్‌కు నిరాకరించడం మానసిక క్రూరత్వమే..

‘‘హెర్బల్ లైఫ్‌లాంటి గొలుసుక‌ట్టు సంస్థలు అమాయ‌క‌పు ప్రజలను మోసం చేస్తున్నాయి. ఐపీఎల్‌కు అఫీషియ‌ల్ పార్ట్‌నర్‌గా ఉన్నామని చెప్పుకొని, ప్రొడ‌క్ట్‌ల పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. ఇలాంటి మోస‌పూరిత సంస్థల్ని పార్ట్‌నర్స్‌గా పెట్టుకోవ‌డంపై ఐపీఎల్ యాజ‌మాన్యం ఓసారి పునరాచించుకోవాలి. హెర్బల్ లైఫ్‌పై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ చ‌ట్ట ప్రకారం చర్యలు తీసుకుని, మోసాల‌కు అడ్డుక‌ట్ట వేయాలి’’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. గతంలోనూ ఆయన ఇలాంటి వాటిపై ఎన్నో అభ్యర్థనలు చేశారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలకు కూడా.. ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని సూచించారు. అలాగే.. జనాలకు కూడా ఇలాంటి సంస్థల ప్రకటనలు, బంఫర్ ఆఫర్లు చూసి మోసపోవద్దని తరచుగా సూచనలు ఇస్తూనే ఉన్నారు.

Raghunandan Rao: ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలి