ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా సేవలు అందిస్తున్న వీసీ సజ్జనార్‌ను తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు. దీనిపై తాజాగా సజ్జనార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘సైబరాబాద్ ప్రజానీకానికి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సేవలు సంతృప్తినిచ్చాయి.. సైబరాబాద్ ప్రజానీకానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.. ఆలాగే తెలంగాణ రాష్ట్ర హోంమంత్రికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి, తెలంగాణ రాష్ట్ర డిజిపికి, ప్రజా ప్రతినిధులకు ముఖ్యంగా ప్రతీ ఒక్క అడుగులో వెన్నంటి నడిచి ప్రోత్సహించిన రంగా రెడ్డి, మేడ్చల్ ప్రజా సంఘాలకు, ప్రజలకు కృతజ్ఞతలు’ అంటూ సజ్జనార్ తెలిపారు.