Site icon NTV Telugu

ఉమ్మడి కరీంనగర్‌లో భారీగా పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ విలువ

ఉమ్మడి కరీంనగర్‌లో భారీగా పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ విలువ నేటి నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మార్కెట్ విలువ అమాంతం పెంచడంతో ప్రజల పై దాదాపుగా 40కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌ పట్టణంలోని మార్కెట్‌ ఏరియాలో గజానికి 32,500 ఉంటే ఇప్పుడు 37,400 అయ్యింది. మార్కెట్ ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ ఫీజు సైతం గణనీయంగా పెరుగుతుంది.గతంతో పోలిస్తే ఇప్పుడు లక్షల్లో తేడా వస్తుంది. పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీ లతో ఆ శాఖ ఖజానా లో కోట్లాది రూపాయలు జమకానున్నాయి.

వ్యవసాయేతర భూములు చదరపు గజానికి మార్కెట్ విలువ ప్రకారం

కరీంనగర్ జిల్లా:-
పాతవిలువ 32,500
కొత్త విలువ 43,900

పెద్దపల్లి జిల్లా
పాత విలువ 28,750
కొత్త విలువ 38,900

జగిత్యాల జిల్లా
పాత విలువ 21,500
కొత్త విలువ 29,100

రాజన్న సిరిసిల్ల జిల్లా
పాత విలువ 13,000
కొత్త విలువ 17,600

Exit mobile version