NTV Telugu Site icon

తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. సూపర్ స్పైడర్స్‌కి వ్యాక్సిన్..

vaccination

10 రోజుల తాత్కాలిక బ్రేక్ త‌ర్వాత తెలంగాణ‌లో ఇవాళ్టి నుంచి రెండో డోసు వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైందే.. ఇక‌, ఇదే స‌మ‌యంలో.. వ్యాక్సినేష‌న్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. ఈ నెల 28వ తేదీ నుంచి సూప‌ర్ స్పైడ‌ర్స్ అంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది.. ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరా చేసేవారు, రేషన్ దుకాణాల డీలర్లు, పెట్రోల్ పంపుల వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లు, కూరగాయలు, పండ్లు, పూలు, నాన్‌వెజ్ మార్కెట్లు, కిరాణా దుకాణాల వారు, మద్యం అమ్మకాల వారికి టీకా ఇవ్వడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది స‌ర్కార్.. వీరు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 30 లక్షల మంది వరకు ఉంటారని అంచనా వేశారు. మొద‌ట‌గా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఆటోడ్రైవ‌ర్లుకు వేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. 18-44 ఏళ్ల వారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న 4.90 ల‌క్ష‌ల డోసులను సూప‌ర్ స్పైడ‌ర్స్‌కి ఇచ్చేందుకు ఉప‌యోగించ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది. మంత్రి హ‌రీష్‌రావు నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశంలో.. సూపర్ స్పైడర్లకు టీకాలు వేసే విషయంపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నారు.. ఈ సమావేశానికి సీఎస్ సోమేష్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.