NTV Telugu Site icon

V Hanumantha Rao: సీనియర్లను పట్టించుకోవట్లేదు.. స్రవంతికి టికెట్ ఇవ్వడంపై వీహెచ్ స్పందన

V Hanumantha Rao Palvai Tic

V Hanumantha Rao Palvai Tic

V Hanumantha Rao Reacts On Palvai Sravanthi Ticket: పాల్వాయి స్రవంతికి మునుగోడు టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు స్పందించారు. ఆమెకు టికెట్ ఇవ్వడం మంచిదేనని, ఓ కార్యకర్తకు టికెట్ ఇచ్చారని అన్నారు. పాల్వాయి స్రవంతి ఒక పక్కా కాంగ్రెస్ వ్యక్తి అని తెలిపారు. డబ్బులే రాజకీయం కాదని, పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇవ్వడమంటే గౌరవం ఇవ్వడమని చెప్పారు. కానీ.. పార్టీ సీనియర్ నాయకులను పరిగణనలోకి తీసుకోకపోవడమే బాధాకరమన్నారు. ఇప్పటికీ వాళ్లకు వాళ్లే మాట్లాడుకుంటున్నారని, తమదాకా ఎలాంటి సమాచారం రావడం లేదని పేర్కొన్నారు. అంటే.. పార్టీ నిర్ణయాల్లో సీనియర్లను పెద్దగా ఇన్వాల్వ్ చేయట్లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంగతేంటో తెలియడం లేదని, పార్టీ అధిష్టానం ఏం కో-ఆర్టినేషన్ చేస్తోందో తనకేం తెలియదని వీ హనుమంతరావు వెల్లడించారు. వెంకటరెడ్డి ముందుకు వస్తే మంచిదన్నారు. హైకమాండ్ ఎవరితో సంప్రదిస్తోందనే విషయాలు తనకు పూర్తిగా తెలియదన్నారు. ఇక తమిళిసై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తన నలభై ఏళ్ల జీవితంలో ఇలా మాట్లాడిన గవర్నర్ లేరన్నారు. సీఎం కేసీఆర్, గవర్నర్ మధ్య తగాదా ఏంటో స్పష్టత లేదన్నారు. అయితే.. ఆ ఇద్దరి మధ్య గ్యాప్ ఏ విషయంలో వచ్చిందనేది ప్రజలకు తెలియాలని సూచించారు.