ఇటీవల అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అస్సాం సీఎం వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మాట్లాడుతూ.. బీజేపీ ఫ్రెస్టేషన్‌లో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్ మీద మాట్లాడినందుకు కాదు.. మోడీ నీ రాజు అన్నాడని అక్కసుతో రాహుల్ గాంధీని దూషించారని ఆయన విమర్శించారు.
మోడీకి తెలంగాణ, ఏపీలో పార్టీ ఎదగదు అని అర్దం అయ్యిందని, అందుకే తెలంగాణ రాష్ట్ర మీద మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. తెలంగాణకి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలని ఆయన అన్నారు. ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అస్సాం సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేయాలని నేనే ప్రతిపాదిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు.
