దశాబ్ది ఉత్తవాల్లో క్రీడాకారులకు ప్రోత్సహం ఎక్కడ..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2022లో జరిగిన ఇంటర్నేషనల్ బ్యాటమెంటన్‌లో ప్రైజ్ మనీ కింద చెక్ లు ఇచ్చారని, ఇప్పటి వరకు ఆ చెక్ ల తో డబ్బులు తీసుకునే పరిస్థితి లేదన్నారు. క్రీడాకారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, బీసీ బంధు పేరుతో లక్ష ఇస్తామని కొత్త డ్రామా కి తెర లేపారని ఆయన మండిపడ్డారు.
Also Read : Virat Kohli: కృష్ణ దాస్ కీర్తనల్లో పాల్గొన్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.
దళిత బంధు లెక్కనే.. బీసీ బంధు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ కార్యాలయం కి మాత్రం భూములు తీసుకుంటున్నారని, మేము అడిగితే మాత్రం సైలెంట్ గా ఉంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వవు.. స్పోర్ట్స్ కొటా లో ఉద్యోగాలే మానేశారని ఆయన ధ్వజమెత్తారు. ఎల్బీ స్టేడియంలో సభలు.. సమావేశాలు పెడతావు కానీ క్రీడా కారులకు మాత్రం డబ్బులు ఇవ్వవు అంటూ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఓబీసీ అయ్యి ఉండి.. బీసీ లకు మేలు చేయలేదని, కులాల వారీగా జనగణన జరగాలన్నారు.
Also Read : Mahindra Thar vs Maruti Suzuki Jimny: “థార్ వర్సెస్ జిమ్నీ”.. మైలెజ్, ఇంజన్ ఆప్షన్స్.. ధరల వివరాలు ఇవే..
