Uttam Kumar Reddy: నా శాఖలైన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలో అవినీతి రహిత, పారదర్శకంగా, జవాబుదారితనంతో పాలన అందజేస్తామని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు నూతన శకం మొదలైంది. ప్రజలందరికీ హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 60 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం తర్వాత 2014 కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలకు రాష్ట్రం వచ్చింది కానీ దురదృష్టవశాత్తు టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం రాలేదన్నారు. పదేళ్ల నిర్బందాలు, నియంత పాలనను పారద్రోలి ప్రజలు మళ్ళీ ఒక ప్రజాస్వామ్య పాలనకు అంకురార్పణ చేశారని అన్నారు. ప్రజా పాలన మొదలు కావడంతో స్వచ్ఛగా బతుకుతున్నారు. రాష్ట్రములో ఒక పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. సచివాలయంలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి వారి విజ్ఞప్తులను అందజేస్తున్నారని తెలిపారు.
Read also: Health Tips : హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
ప్రజా భవన్ ప్రజల అవసరాలకు ఉపయోగపడుతుందని అన్నారు. శాసనసభలో ప్రతిపక్ష, అధికారపక్ష సభ్యులు ప్రజల కోసం అంశాల వారిగా చర్చిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయని తెలిపారు. ఇలాంటి పాలన కోసమే ప్రజలు తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించుకున్నారని అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు, అవినీతి పాలు చేసి దివాళా తీశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రజలకు మేలు చేసే విదంగా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. నా శాఖలైన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలో అవినీతి రహిత, పారదర్శకంగా, జవాబుదారితనంతో పాలన అందజేస్తా అన్నారు. ప్రజలకు తప్పకుండా ప్రజా పాలన అందిస్తామన్నారు.
Vidadala Rajini: మంత్రి విడుదల రజిని కార్యాలయంపై రాళ్ల దాడి.. పోలీసుల అదుపులో టీడీపీ-జనసేన కార్యకర్తలు!