Uttam Kumar: నాణ్యత లేకుండా ఎలా చేసారు.. ఎల్ అండ్ టి ప్రతినిధులపై ఉత్తమ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar: అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేసారని, ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సచివాలయంలో మెడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్ అండ్ టి ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో ఎల్ అండ్ టి గ్రూప్ డైరెక్టర్ ఎస్. వి దేశాయ్ పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో మంత్రి ఉత్తమ్ ఎల్.అండ్ టి ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరకం పనులు చేసారని మండిపడ్డారు. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేసారని ఉత్తమ్ నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అన్నారం, సిందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
Read also: Salaar Trailer: ఏ బాబు లేవ్… రిలీజ్ ట్రైలర్ ఏడ?
Also Read
గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ మీటింగ్ కు ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు తదితరులు వచ్చారు. అయితే.. మరోవైపు సూర్యాపేట జిల్లా అధికారులతో సమీక్ష కారణంగా సచివాలయం ఉత్తమ్ కుమార్ రెడ్డి బయలు దేరారు. ఇక మరోవైపు విద్యుత్ పై సమీక్ష కారణంతో పీసీసీ పొలిటికల్ కమిటీ సమావేశం నుంచి సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికలపై సన్నాహకంపై చర్చ కొనసాగుతుండగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నుంచి వెళ్లిపోవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది.
Komati Reddy: తెలంగాణలో కుటుంబ పాలన అంతమైంది.. ప్రజాపాలన ప్రారంభమైంది..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?