NTV Telugu Site icon

Telangana Weather: వెరైటీ వెదర్‌.. చలి, ఎండకాలం మధ్యలో అకాల వర్షాలు ఎంట్రీ

Telangana Rains Updats

Telangana Rains Updats

Telangana Weather: మొన్నటి వరకు రాష్ట్రంలో చలి చంపేసింది. నగరవాసులు శివరాత్రి వరకు చలితో వనకాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అయితే గత వారం రోజుల నుంచి ఎండలు దర్శనమిచ్చాయి. హమ్మయ్య చలి పోయింది ఎండలు వచ్చాయి కాస్త ఉపసమయం కలిగింది అనుకునేలోపే ఇప్పుడు వెరైటీగా చలి, ఎండకాలాల మధ్యలో అకాల వర్షాలు ఎంట్రీ ఇచ్చాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురిసిన ఈ అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు. ఇక నిర్మల్‌ జిల్లాలోని భైంసాలో అకాల వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం పూట తానూర్‌, ముధోల్‌ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసాయి. ఈ వర్షంతో ఆ ప్రాంతంలోని రైతుల్లో ఆందోళన నెలకొంది.

Read also: Texas Megachurch: టెక్సాస్‌ మెగాచర్చిలో కాల్పులు.. మహిళను కాల్చి చంపిన పోలీసులు!

ఆరు గాలం శ్రమించి పండించిన పంట చేతికోచ్చే సమయంలో ఇలా అకాల వర్షం కురవడంతో తమ కష్టమంతా నీటి పాలవుతుందామో అని రైతుల ఆందోళన చెందుతున్నారు. వర్షంతో పలుచోట్ల వరి పైర్లన్ని నేలరాలాయి. దీంతో రైతన్న కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే.. రెండు మూడు రోజులుగా ఉదయం పూట ఎండలు మండుతుంటే.. సాయంత్రం కాగానే ఈదురు గాలులు వస్తుండటంతో.. అన్నదాతలకు టెన్షన్‌ మొదలైంది. ఏటా పంట చేతికి వచ్చే సమయంలోనే వర్షాలు కురవడం పంటంతా వర్షార్పణం కావటం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. వరి రైతులతో పాటు మామిడి రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. వర్షం, ఈదురు గాలుల వల్ల మామిడి పూత రాలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
Texas Megachurch: టెక్సాస్‌ మెగాచర్చిలో కాల్పులు.. మహిళను కాల్చి చంపిన పోలీసులు!