Site icon NTV Telugu

Union Minister Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట విషాదం..

Jeevan Reddy

Jeevan Reddy

Union Minister Kishan Reddy: కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత కిషన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది.. కిషన్‌రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి మృతిచెందాడు.. ఆయన వయస్సు 50 ఏళ్లు.. జీవన్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.. హైదరాబాద్‌లోని సైదాబాద్ వినయ్ నగర్‌లో కిషన్‌రెడ్డి అక్క బావ లక్ష్మీ, నర్సింహారెడ్డి నివాసం ఉంటారు.. వాళ్ల కుమారుడే జీవన్‌రెడ్డి.. గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయిన జీవన్‌రెడ్డిని.. వెంటనే కుటుంబ సభ్యులు కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఏ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జీవన్‌రెడ్డి మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.. ఇక, జీవన్‌రెడ్డి అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు.. మృతుడు జీవన్‌రెడ్డికి భార్య. ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read Also: WhatsApp: వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్‌.. ఇక ఇలా చేయొచ్చు..

Exit mobile version