NTV Telugu Site icon

మానవత్వం చాటుకున్న కేంద్రమంత్రి

Kishan Reddy

క‌రోనా స‌మ‌యంలో కొంత‌మంది అయిన‌వారు కూడా మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.. ఆదుకోవ‌డానికి ముందుకు రావ‌డం త‌ర్వాత సంగ‌తి.. క‌నీసం ప‌ల‌క‌రించ‌డానికి కూడా వెనుక‌డుగే వేస్తున్నారు.. అయితే, ఈ స‌మ‌యంలో మానవత్వం చాటుకున్నారు కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి.. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు నేరుగా ఫోన్ చేసి మేం ఉన్నామంటూ భరోసా క‌ల్పించారు.. హైద‌రాబాద్‌లోని సైదాబాద్ ఎబ్బీఐ కాల‌నీకి చెందిన దంప‌తులు క‌రోనాత మృతిచెందారు.. ఈ నెల 13వ తేదీన భ‌ర్త జ‌గ‌దీష్ క‌న్నుమూస్తే.. 18వ తేదీన భార్య గీత ప్రాణాలు వ‌దిలారు.. దీంతో.. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన సంజ‌న‌, హ‌నుమాన్ అనాథ‌లుగా మారిపోయారు.. పిల్లలకు కరోనా ఉండటంతో సంబంధికులు కూడా ప‌ట్టించుకోలేదు.. ఇంట్లోనే ఉండి కరోనా చికిత్స తీసుకుంటూ.. మందులు వాడుతున్నారు చిన్నారు.. అయితే, ఈ ఘ‌ట‌న‌ను WE & SHE అనే స్వచ్చంద సంస్థ మంత్రి కిష‌న్‌రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఆయ‌న‌.. ఇవాళ సంజనతో ఫోన్లో మాట్లాడారు.. కరోనాతో ఇలా జరగడం దురదృష్టకరం.. సంజన, హనుమాన్… మీకు మేం, మా పార్టీ అందుబాటులో ఉంటాం, సహాయం చేస్తాం.. ధైర్యంగా ఉండి, చదువును కొనసాగించాల‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లాగా తెలంగాణ‌లో కూడా త‌ల్లిదండ్రులు కోల్పోయిన మీలాంటి వారికి రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం చేయాల‌ని సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తాన‌ని తెలిపారు.