Site icon NTV Telugu

BJP National Executive Meeting: కావాలనే రెచ్చగొడుతున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్

Kishanreddy Bjp

Kishanreddy Bjp

నగరంలో.. టీఆర్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ మహాసభ నేపథ్యంలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, నిర్వహించబోయే ర్యాలీలకు పోటీగా టీఆర్ఎస్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ర్యాలీలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రోటోకాల్ పాటించకపోయినా పర్వాలేదు కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

టీఆర్ఎస్ శ్రేణులు కావాలనే పనిగట్టుకొని, బీజేపీకి వ్యతిరేకంగా ప్లెక్సీలు.. ర్యాలీలు తీస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే.. ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు.. ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లే దారుల్లోనే ప్లెక్సీలు ఏర్పాటు చేసి రెచ్చగొడుతున్నారని ఆగ్రమం వ్యక్తం చేసారు. కాగా.. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అభద్రతా భావంతో పాటు అహంకారం చూపిస్తోందని తెలిపారు. వారికి అధికారం చేతిలో ఉందని ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Live: హైదరాబాద్‌లో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ర్యాలీ

Exit mobile version