Site icon NTV Telugu

Amit Shah : హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్‌ షా

Amit Shah

Amit Shah

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్న అమిత్‌ షాకు 20 మంది బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా ఆయన బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి కొత్తగా సీఎఫ్‌ఎస్‌ఎల్‌ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ వద్దకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎఫ్‌ఎస్‌ఎల్‌ క్యాంపస్‌లో నేషనల్‌ సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీని అమిత్‌ షా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీ నేతలతో అమిత్‌ షా భేటీ కానున్నారు. ఆ సమావేశం ముగిశాఖ తుక్కుగూడ సభలో అమిత్‌ షా పాల్గొననున్నారు.

Live Updates: అమిత్‌ షా పర్యటన మినిట్ టు మినిట్

Exit mobile version