NTV Telugu Site icon

ప్రగతి భవన్‌ వద్ద యువకుల హల్‌చల్‌.. ఆత్మహత్యాయత్నం..!

Pragathi Bhava

Pragathi Bhava

హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ దగ్గర ఇద్దరు యువకులు హల్ చల్‌ చేశారు… మంత్రి హరీష్‌రావు కాన్వాయ్‌ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు.. ఇక, వేగంగా దూసుకెళ్తున్న కారు కింద పడి ఆత్మహత్యాయత్నం చేశారు.. కారు డ్రైవర్ అప్రమత్తతలో ప్రమాదం తప్పగా.. ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు యత్నించాడు మరో యువకుడు.. ఆ ఇద్దరు అన్నదమ్ములు గుర్తించారు పోలీసులు.. అదే సమయంలో ప్రగతి భవన్‌ దగ్గర మంత్రి హరీష్‌రావు క్వానాయ్‌ రాగా.. క్వానాయ్‌ పైకి దూసుకెళ్లారు.. దీంతో.. ఇ ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు బేగంపేట్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.. అయితే, గతంలో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసినట్టుగా చెబుతున్నారు.. పలుమార్లు జైలుకు సైతం వెళ్లివచ్చారు.. పేట్‌ బషీర్‌బాగ్‌లో పలు భూకబ్జాలుకు పాల్పడినట్టు వీరిపై ఆరోపణలు ఉండగా.. ఒక ఇంటి ల్యాండ్‌ వ్యవహారంలో ఇటీవల ఆ ఇద్దపై మరో కేసు నమోదు అయ్యింది. అయితే, పేట్‌ బషీర్‌బాగ్‌ పోలీసులు తమను టార్చర్ పెడుతున్నారంటూ నినాదాలు చేశారు యువకులు.. సీఐ హింసిస్తున్నారంటూ ఆరోపించారు.