NTV Telugu Site icon

RangaReddy courts: కత్తితో కోర్టులోకి.. ఆతర్వాత ఏమైంది?

Knife Court

Knife Court

ఈమధ్యకాలంలో కోర్టుల్లోనూ, కోర్టుల బయట తుపాకులు, కత్తులతో కొందరు తిరుగుతున్నారు. తాజాగా రంగారెడ్డి కోర్టుల దగ్గర ఇలాంటి ఘటనే జరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా కోర్టు లోకి కత్తితో ప్రవేశించాలని చూసిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయి కిరణ్ అతని మిత్రుడిని అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీసులకి అప్పగించారు కోర్టు సెక్యూరిటీ సిబ్బంది.

గత సంవత్సరం మియాపూర్ కి చెందిన ఒక యువతి తన క్లాస్ మేట్ మైనారిటీ యువకుడు అక్బర్ ని ప్రేమించి ఉప్పల్ చెంగిచర్ల లోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకుంది. కుటుంబ కలహాలతో గత మూడు నెలల క్రితం డైవర్స్ కి కోర్టు లో పిటిషన్ వేసింది. అమ్మాయి తమ్ముడు మాత్రం తన అక్కని ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తి అక్బర్ పై కోపం పెంచుకున్నాడు. కోర్టుకు హాజరవుతున్నారని తెలిసి యువతి తమ్ముడు సాయి కిరణ్ నడుములో కత్తి పెట్టుకుని తన మిత్రునితో కలిసి కోర్టు లోకి ప్రవేశించాలని చూడగా అక్కడే వున్న సెక్యూరిటీ సిబ్బంది వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

సదరు అమ్మాయి మాత్రం మాకు ప్రాణభయం ఉండటం వలన తన తమ్ముడు అలా పెట్టుకుని వచ్చాడని సమాధానం ఇవ్వడం విస్మయానికి గురిచేసింది. కోర్టు సెక్యూరిటీ అప్రమత్తత తో పెను ప్రమాదం తప్పిందని అక్కడి న్యాయవాదులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో పరువు హత్యలు జరుగుతున్న తరుణంలో లో ఆలాంటి దారుణానికి ఒడిగట్టడం కోసం ఏమైనా వచ్చి ఉంటారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సెక్యూరిటీ అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని న్యాయవాదులు, కోర్టుకి వచ్చిన సందర్శకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Ponnala Lakshmaiah : కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తున్నారు