NTV Telugu Site icon

Heavy Rain in Warangal: తెల్లారితే నిశ్చితార్థం.. అంతలోనే ఘోరం..!

Warangala Floods

Warangala Floods

వరంగల్ జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చయమై.. తెల్లారితే నిశ్చితార్థం అనగా మృత్యువు ఊహించని విధంగా వర్షాల రూపంలో ఆ యువకున్ని మింగేసింది. ఈ ప్రమాదంలో యువకుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందగా.. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా వరంగల్‌లోని మండి బజారులో ఓ పాత భవనం కూలడంతో..ఇద్దరు మృతి చెందారు. వరంగల్ నగరంలోని మండి బజార్ మెయిన్ రోడ్ లో గ్రాంపాస్ బేకరీ పురాతనమైన బిల్డింగ్ కూలి పక్కనే ఉన్న గుడిసె పై పడడంతో అందులో ఉంటున్న దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన పైడి అనే వృద్ధునితోపాటు ఫిరోజ్ అనే యువకుడు అక్కడికక్కడే శిధిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. సలిమా అనే మహిళ తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

అయితే.. ఫిరోజ్ రంగశాయిపేట్ చెందిన ఓ అమ్మాయితో నిశ్చితార్థం ఉండడంతో అన్న వదిన చిన్న పాప నలుగురు నిన్న (శుక్రవారం) సాయంత్రం కృష్ణ ఎక్స్ప్రెస్ లో వరంగల్ కి వచ్చారు. తన తల్లి సలిమా దగ్గర ఫిరోజ్ పడుకున్నారు. వదినే అన్న బిడ్డ రంగ షాపేట్లోని బందులు ఇంట్లో పడుకోగా రాత్రి ఘటనలో ఫిరోజ్ మృతి చెందాడు. నవ వరుడు ఇలా మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులలో రోదనలు మిన్నంటాయి. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిన బాధ్యత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వారి కేవలం నోటీసులు జారీచేసి చేతులు దులుపుకున్నారు. దీంతో గత నెలలో చార్బోలిలో గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన మరువకముందే మళ్ళీ ఈరోజు ఎల్లం బజార్లో మరో ఇద్దరు మృతి చెందారు. బల్దియా అధికారుల తీరు పట్ల గ్రేటర్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Governor Tamilisai: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్