Secunderabad PG Hostel: లేడీస్ హాస్టల్ లో చొరబడి ఇద్దరు యువకులు.. సికింద్రాబాద్ లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad PG Hostel: సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ లో ఇద్దరు ఆగంతకులు చొరబడిన ఘటన కలకలం రేపుతోంది. అర్దరాత్రి ఉమెన్స్ హాస్టల్ లోని బాత్ రూం లో ఇద్దరు ఆగంతకులను గుర్తించిన విద్యార్థినిలు గట్టిగా కేకలు వేశారు. వారిని పట్టుకునేందుకు విద్యార్థినులు పరుగులు పెట్టారు. అయితే ఇద్దరు ఆగంతకుల్లో ఒకరు అక్కడి నుంచి తప్పించుకుని హాస్టల్ నుంచి పరార్ అయ్యాడు. అయితే ఒకరు ఆగంతకున్ని పట్టుకున్న విద్యార్థినిలు దేహశుద్ధి చేశారు. ఆగంతకుని అక్కడే కట్టేసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన పీజీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ క్యాంపస్ కు వచ్చారు. ఆగంతుకుని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించకుండా విద్యార్థినిలు అడ్డుకుంటున్నారు. తమకు న్యాయం జరిగే వరకు తీసుకుపోవద్దంటూ పోలీసు వాహనాలకు విద్యార్థినులు అడ్డంగా కూర్చున్నారు. వాహనాలు కదిలించేది లేదని భీష్మించుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు.
Read also: Fire Accident : ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం.. ఇద్దరికి గాయాలు
Also Read
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
- Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
- Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
దీంతో పీజీ ఉమెన్స్ ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్ కి రిజిస్టార్ వచ్చారు. రిజిస్టార్కు వ్యతిరేకంగా విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు వీసీ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ కు నచ్చచెప్పేదుకు అధికారులు, పోలీసులు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. అయినా విద్యార్థినిలు ససేమిరా అంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉస్మాని యూనివర్సిటీకి చెడ్డ పేరు తెచ్చేలాగా అధికారులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గుడార్రాలాంటి హాస్టల్లో తాము నివసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రక్షణ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి ఒకే ఒక్క ఫిమేల్ సెక్యూరిటీ గాడు ఉంటుందని, దీంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని చెప్పినా.. అయినా యూనివర్సిటీ అధికారులు, కాలేజీ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
ఇప్పటికైనా అధికారలు, పోలీసులు స్పందించాలని కోరుతున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆందోళన చేస్తున్నా ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. సరైన వసతులు లేవని ప్రధానోపాధ్యాయులు, రిజిస్ట్రార్ వినడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని, భద్రతా గోడలు చిన్నగా ఉండడం, సీసీ కెమెరాలు లేకపోవడంతో వాటి రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గతంలోనే హాస్టల్ వార్డెన్‌కు సూచించామని తెలిపారు. ఇప్పుడు హాస్టల్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారని.. ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని.. తమ సత్తా చాటుతామని హెచ్చరించారు.
YS Sharmila: నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!