NTV Telugu Site icon

Warangal Crime: వైద్యం ముసుగులో క్షుద్రపూజలు.. హనుమకొండలో ఇద్దరు నకిలీ డాక్టర్స్ అరెస్ట్

Fake Doctors

Fake Doctors

Warangal Crime: సమాజం మారుతున్న మూఢ నమ్మకాలపై విశ్వాసం ప్రజల్లో ఇంకా చావలేదు. బతుకులు బాగుపడతాయని ఆశతో వారు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును మోసగాళ్ల చేతిలో పెడుతున్నారు. దీన్ని ఆశరాగా చేసుకున్న కేటుగాళ్లు అమాయక జనాలను నమ్మించి డబ్బులను గుంజుకుంటున్నారు. ఇలాంటి వార్తలు వస్తున్నా అయినా ప్రజలు ఇలాంటి వారిని నమ్మి మోసపోతునే వున్నారు. మంత్రాల నెపంతో, చేతబడులను క్షుద్రపూజలతో తగ్గిస్తానని అమాయక పేద ప్రజలను మానసికంగా వేధిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు మంత్రగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

Read also: Shocking Incident: బర్త్ డే రోజే చిన్నారి మృతి.. హృదయవిదారక ఘటన

హన్మకొండ ఠాణా పరిధిలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖాదిర్ అహ్మద్ (53), అతని పెద్ద కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మద్ (47) ఫారాహీనా పేరుతో ఆసుపత్రిని ప్రారంభించారు. గతంలో అతని తండ్రి ఖరీముల్లా ఖాద్రీ పూజలు, తాయత్తులు చేసేవారు. ఈ అనుభవంతో 35 ఏళ్ల నుంచి హన్మకొండ నయీంనగర్‌లోని కేయూసీ క్రాస్‌ రోడ్డులో ఫారాహీనా క్లినిక్‌ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పత్రాలు లేకుండా వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. తన వద్దకు వచ్చే రోగులకు చేతబడి చేశారనీ, దెయ్యం పట్టిందనీ, మానస దృష్టి ఉందనీ, సంతానం కలగదనీ, లోపాల వల్ల ఉద్యోగాలు రావని భయపెట్టి ఆస్పత్రి ముసుగులో క్షుద్రపూజలు చేస్తున్నాడు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో క్షుద్రపూజలు చేయడం ద్వారా తన దగ్గరికి వచ్చే వారికి రోగాలు నయమవుతాయని నమ్మించి ఒక్కొక్కరి నుంచి లక్షా యాభై వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ వ్యవహారం కాస్త ఆనోటా.. ఈనోటా వచ్చి చివరికి ఓ బాధితుడి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో జితేందర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్, ఏసీపీ, టాస్క్ ఫోర్స్ బృందాలు, వైద్య సిబ్బంది పారాహీనా ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఫేక్ డాక్టర్ ముసుగులో క్షుద్రపూజలు చేసి తగ్గిస్తామని, సంతానం లేని వారికి సంతానం కలిగేలా చేస్తామని, ఆరోగ్య, ఉద్యోగం, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులతో పాటు దూర ప్రాంతాల ములుగు, కరీంనగర్, జమ్మికుంట, కొంకపాక, అదిలాబాద్ ఇతర గ్రామాల నుంచి వచ్చే పేదలను మోసం చేస్తున్న సయ్యద్ ఖదీర్ అహ్మద్, అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్, లను సెంట్రల్ జోన్ డీసీపీ ఏం. ఏ బారి అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వారిని నమ్మవద్దని ఎన్ని సార్లు చెప్పినా ప్రజలు వారినే నమ్మి మోసపోతున్నారని, ఎక్కడైనా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారు ఎదురైతే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు.
India vs Australia ODI: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు అలర్ట్.. ఆఫ్‌లైన్‌లో విశాఖ వన్డే టికెట్లు