NTV Telugu Site icon

ఖమ్మంలో విషాదం.. చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి

ఖమ్మం బ్రాహ్మణ బజార్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఓ ఖాళీ స్థలంలో ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్న సమయంలో భారీ చెట్టు కూలి పక్కనే ఉన్న గోడ మీద పడింది. దీంతో గోడ కూడా కూలింది. దీంతో గోడ పక్కనే ఆడుకుంటున్న చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు గాయపడగా స్థానికులు వెంటనే వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Read Also: మీకు కరోనా సోకిందా.. అయితే ఈ మందులు వాడండి..!

కాగా సమాచారం అందుకున్న వెంటనే మేయర్ నీరజ, అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు దిగాంత్ శెట్టి (11), రాజ్ పుత్ ఆయుష్ (6)గా అధికారులు గుర్తించారు. చిన్నారులు చనిపోవడంతో వారి కుటుంబీకులు రోధిస్తున్న తీరు స్థానికంగా అందరినీ కంటతడి పెట్టించింది. కాగా గత ఏడాది అక్టోబర్‌లోనూ గద్వాల్‌ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయిజా మండలంలో గోడ కూలి ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.