ఖమ్మం బ్రాహ్మణ బజార్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఓ ఖాళీ స్థలంలో ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్న సమయంలో భారీ చెట్టు కూలి పక్కనే ఉన్న గోడ మీద పడింది. దీంతో గోడ కూడా కూలింది. దీంతో గోడ పక్కనే ఆడుకుంటున్న చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు గాయపడగా స్థానికులు వెంటనే వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. Read Also: మీకు కరోనా సోకిందా.. అయితే ఈ మందులు…
కడప జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు కొత్తపల్లిలో దారుణం జరిగింది. బావిలో ఓ మహిళ ఇద్దరు పిల్లలు గుర్తు తెలియని మృతదేహాలు కలకలం రేపాయి. చెరువులో తేలాడుతున్న మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో నీటి నుండి వెలికి తీసిన రెవెన్యూ, పోలీసులు వారి గురించి ఆరా తీస్తున్నారు. ఎవరైనా చంపి బావిలో వేశారా లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తల్లి, ఇద్దరు కొడుకులు మృతికి కారణాలను…