NTV Telugu Site icon

Turkayamjal Murder Case: తుర్కయాంజల్ మర్డర్‌ కేసులో ట్విస్ట్‌..

Turkayamjal Murder Case

Turkayamjal Murder Case

Turkayamjal Murder Case: తుర్కయాంజల్ మర్డర్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల క్రితం గంజాయి మత్తులో తండ్రిని హత్య చేసినట్లు వార్తలు రావడంతో పోలీసులు కొడుకుని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. అయితే.. ఈ మర్డర్ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్‌కు బానిసై తండ్రిని చంపాడంటూ కథనాలు వచ్చాయని తేలింది. కానీ.. హత్యకు గురైన వ్యక్తి మాజీ నక్సలైట్ తిరుపతి బాలన్నగా గుర్తించారు పోలీసులు. హత్యకు గురైన బాలన్న గతంలో నయీం గ్యాంగ్‌లో కీలకంగా పనిచేశాడని పోలీసుల దర్యాప్తు సంచలన విషయాలు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

Read also: Pothina Mahesh: పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు.. జనసేన.. ప్రజారాజ్యం 2.. అడ్రస్ గల్లంతే..!

బాలన్నపై ఇప్పటికే 35కు పైగా మర్డర్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. బాలన్న హత్యకు వేరే కారణాలు ఉన్నాయానే కోణంలో విచారణ చేపట్టారు. నెల రోజుల క్రితమే బాలన్న రూ.కోటి విలువైన ఇల్లు కొన్నట్లు గుర్తించారు. నయీం ఆస్తుల వివరాలు బాలన్నకు తెలుసన్న ప్రచారం జరుగుంది. బాలన్నను హత్య చేసింది రెండో భార్య కొడుకు అనురాగ్‌ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల కోసమే బాలన్నను హత్య చేశాడా? లేక మరో కోణం ఉందా? అనే దానిపై పోలీసులు విచారణ కొనసాగుతుంది.

Read also: Hafiz Saeed: ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయాద్‌పై విష ప్రయోగం.. సోషల్ మీడియాలో దుమారం..

హైదరాబాద్ లోని తుర్కయాంజాల్‌ లో రవీందర్ కుటుంబం ఆరెంజ్ అవెన్యూలో కాలనీలో నివాసం ఉంటుంది. నాగర్ కర్నూల్ కొల్లాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ కుటుంబం.. కొడుకు కోసం రెండు నెలల క్రితమే తుర్కయాంజాల్‌ లో ఇల్లు కొనుగోలు చేసి అనురాగ్ కుటుంబం అక్కడికి వచ్చింది. గంజాయి విషయంలో గురువారం సాయంత్రం అనురాగ్ అతని తండ్రి రవీందర్ల మధ్య గొడవ జరిగింది. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న అనురాగ్ తండ్రితో వాగ్వివాదానికి దిగాడు. మత్తులో కోపంతో తండ్రి పై అనురాగ్‌ దాడికి పాల్పడ్డాడు.

Read also: Dasara Movie: దసరా సినిమాలో నాని ఫ్రెండ్ క్యారెక్టర్‌ నేను చేయాల్సింది: మ్యూజిక్ డైరెక్టర్

అనురాగ్, తండ్రి వెంటపడి నిప్పంటించడంతో రవీందర్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో అనురాగ్ ను విచారిస్తున్నారు పోలీసులు. అనురాగ్ కు డ్రగ్స్ ఎక్కడినుండి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం స్థానికులకు భయాందోళన కలిగిస్తున్నాయి. గంజాయి ఇతర మత్తుపదార్థాలను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వెయ్యాలని కోరుతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Funeral Poster: ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. శ్రద్దాంజలి ఫ్లెక్సీతో షాక్‌ ఇచ్చిన తండ్రి..