Site icon NTV Telugu

Tummala Nageswara Rao : రాష్ట్రంలో పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ సాగు

Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

రాష్ట్రoలోని ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల కోసం ముడి పామాయిల్ ధరలు స్థిరీకరించానికి ముడి పామాయిల్ దిగుమతి పై సుంకాలని విధించి పామాయిల్ గెలలకు లాభదాయకమైన ధరలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు తెలిపారు. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి భారత ప్రభుత్వం 1992 నుండి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ సాగు అభివృద్దిని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతము, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమము అయినటువంటి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ అయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) ద్వారా అమలు చేయబడుతుందన్నారు.

తెలంగాణలో రాష్ట్రంలో 1992-93 నుండి 2023-24 వరకు సుమారు 2.00 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావడమైనది. తెలంగాణ ప్రభుత్వం (31) జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగింది. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడం కోసం, ఇప్పటి వరకు కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా (42) నర్సరీలు ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి అవశ్యకత దృష్ట్యా, తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ముడి పామ్ ఆయిల్ దిగుమతులపై ఉన్న సుంకాన్ని కేంద్ర ప్రభుత్వo పూర్తిగా ఎత్తివేసింది. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను సంరక్షించడానికి ముడి పామాయిల్ దిగుమతులపై వెంటనే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ సుంకం విదిoచి ఆయిల్ పామ్ గెలల ధరల పెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు వారి ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ గెలల ధరలను కనీసం టన్నుకి రూపాయలు 18 వేలు ఉండేటట్లుగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరడమైనది. కేంద్ర ప్రభుత్వం 2021 లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ అయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) ప్రారంబించి, అందులో భాగంగా రైతులకు లాభదాయకమైన ధరను అందించాలనే ఉద్దేశ్యం తో Viability Gap Funding అనే సూత్రాన్ని ప్రతిపాదించింది. ఈ సూత్రం 19% OER (నూనె ఉత్పత్తి శాతం) ప్రామాణికం గా తీసుకొని పామ్ ఆయిల్ గెలల ధరలు నిర్ణయించబడుతుంది.

పైగా ఉప ఉత్పత్తులయిన ఆయిల్ పామ్ గింజలు నుండి వచ్చే నూనె ధరను పరిగణలోకి తీసుకున్నచో నూనె ఉత్పత్తి శాతం సుమారు 22% గా లభించును. 19% గా నూనె ఉత్పత్తి శాతంను నిర్ణయిచడం వలన రైతులకు నష్టం జరగుతుంది. ఈ కారణంచేత తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ గెలల ధరను నిర్ణయించుటకు పాత పద్దతినే అవలంబిస్తుంది.

పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, ముడి పామ్ ఆయిల్ ధరలు స్థిరీకరించడానికి దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ప్రోత్సహించడం కొరకు ముడి పామ్ ఆయిల్ దిగుమతి సుంకంపై విధివిధానాలను రూపొందించాలని, ఆయిల్ పామ్ రైతులను మరియు కంపెనీల ను కలుపుకుని Viability Gap Funding సూత్రాన్ని తిరిగి సమీక్షించి రైతులకు పామ్ ఆయిల్ గెలల ధర లాభసాటిగా ఉండేలా నిర్ణయించి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడానికి రైతులను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవల్సిందిగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మాత్యులు గారిని మంత్రి వర్యులు లేఖ ద్వారా కోరడమైనది.

Exit mobile version