Tummala Nageswara Rao : జోగులంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పత్తి విత్తనాలను సరఫరా చేసిన రైతులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించేందుకు సీడ్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
గద్వాల జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు జరుగుతోందని, రైతులు విత్తన ఉత్పత్తి చేసి కంపెనీలకు అందించినప్పటికీ వారికి ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదని మంత్రి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణామోహన్‌రెడ్డి ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు.
Tollywood Exclusive: డియర్ ప్రొడ్యూసర్స్.. ఇంకెన్నాళ్లు వేస్తారీ నిందలు!
“రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం. రైతులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడడం మా బాధ్యత. కంపెనీలు రైతులకు చెల్లించాల్సిన డబ్బులు నిలుపుకోవడం సరైన చర్య కాదు,” అని మంత్రి తుమ్మల హెచ్చరించారు.
తన దృష్టికి వచ్చిన సమాచారం ప్రకారం, వివిధ సీడ్స్ కంపెనీలు కలిపి రైతులకు సుమారు రూ. 700 కోట్లు బకాయిలుగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ మొత్తాన్ని వచ్చే నెలలోగా పూర్తిగా చెల్లించాల్సిందిగా కంపెనీల ప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు.
రైతులకు చెల్లింపులపై నిర్లక్ష్యం కనబరిస్తే సంబంధిత కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హెచ్చరించారు. “రైతులకు తక్షణ సాయం అందించడం మా ధ్యేయం. ఆలస్యం జరిగితే ఆర్థిక సమస్యలు రైతులపై భారంగా మారుతాయి,” అని మంత్రి అన్నారు.
Mithun Reddy Mother Emotional: రాజమండ్రి జైలు వద్ద కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ మిథున్ రెడ్డి తల్లి..
