Thummala Nageswara Rao: చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం 18 పాయింట్లను వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేతరంగ అభివృద్ధి కోసం, చేనేత కార్మికుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, స్వయం సమృద్ధి కోసం, దీర్ఘకాలికంగా లబ్ధిచేకూరే పథకాల రూపకల్పన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 18 పాయింట్స్ ఇవే..
1) నూతన ప్రభుత్వం వచ్చిన తరవాత అన్ని ప్రభుత్వశాఖల వారు టెస్కో ద్వారా వస్త్రములను కొనుగోలు చేయుటకు GO.Ms.No.1, dt.11.03.2024 ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇట్టి ఆదేశముల ప్రకారం టెస్కో నుండి non availability certificate లేకుండా ఏ ప్రభుత్వ శాఖకూడా ప్రైవేటు మార్కెట్ ద్వారా వస్త్రములను కొనుగోలు చేయలేరు. దీని ప్రకారము వివిధ ప్రభుత్వ శాఖల నుండి సుమారుగా 255.27 కోట్ల విలువైన ఆర్డర్లు టెస్కోకు వస్త్ర సరఫరా కోసము రావడం జరిగిందని, వీటి వస్త్ర ఉత్పత్తి గావించుటకు ఆర్డర్స్ ఇవ్వటం జరిగిందని మంత్రి తెలపారు.
2) గత ప్రభుత్వం ప్రాథమిక చేనేత సహకార సంఘాలను విస్మరించి MACS సహకార సంఘాలను ప్రోత్సహించటం వలన నిజమైన చేనేత కార్మికులకు లబ్ధి చేకూరలేదు. వాస్తవముగా 393 ప్రాథమిక చేనేత సహకారసంఘాలు ఉన్నప్పటికీ, 105 ప్రాథమిక చేనేత సహకారసంఘాలకు మాత్రమే పని కలిపించబడింది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలోని మొత్తం ప్రాథమిక చేనేత సహకార సంఘాల సభ్యులకు పని కల్పించుటకు, నేటివరకు సుమారుగా 53 కోట్ల విలువైన వస్త్రములను కొనుగోలు చేయటమైనది. అన్ని ప్రాథమిక చేనేత సహకార సంఘములలో సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యులందరికీ పని కలిపించుటకు చర్యలు తీస్కోవటం జరిగింది.
3) నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిశంబర్ 2023 నుండి కొనుగోలు చేసిన వస్త్రములకు సంబంధించి పేమెంట్ ను వెంటవెంటనే విడుదల చేయటం జరుగుతున్నది.
4) నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత సమగ్ర శిక్ష పథకం కింద యూనిఫాం సరఫరా నిమిత్తం 50 శాతం అడ్వాన్సు సుమారుగా 50 కోట్ల రూపాయలు, నూలు కొనుగోలు మరియు సైజింగ్ కొరకు విడుదల చేయటమైనది.
5) దీని ద్వారా నాణ్యమైన నూలు కొనుగోలు చేసి వస్త్ర ఉత్పత్తులకు సుమారుగా 20.00 కోట్లు విలువైన నూలు సరఫరా చేయటమైనది మరియు NHDC ద్వారా కొనుగోలు చేసిన నూలుఖరీదుకు సంబంధించి 2.96 కోట్లు సంబదిత MACS / SSI Units / Sizing Units కు అడ్వాన్సుగా విడుదల చేయటం జరిగింది.
Read also: Rahul Gandhi: వైఎస్సార్ చేసిన రాజకీయం నేడు రాష్ట్రంలో లేదు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
6) గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు 8.81 కోట్లు ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు విడుదల చేసి చేనేత కార్మికులకు నిరంతరము పని కలిపించుటకు చర్యలు తీసుకొనడమైనది. 7.00 కోట్ల రూపాయుల బకాయిలను విడుదల చేయుటకు చర్యలు తీసుకోనుచున్నాము.
7) నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చేనేత, మరమగ్గముల కార్మికుల సంక్షేమం కొరకు రివ్యూ చేసి తాత్కాలిక ప్రయోజనం కంటే దీర్ఘ కాలికముగా లబ్ధి చేకూరే నిమిత్తం పథకముల రూపకల్పన కొరకు ఆదేశించి ఉన్నారు. దీనిలో భాగంగా నేత కార్మికుల స్వయం సమృద్ధి కొరకు నేతన్న భరోసా అనే ప్రభుత్వ విధానమును రూపొందించుట కొరకు చర్యలు తీసుకొనుచున్నాము. Indian Institute of Handloom Technology (IIHT) ఏర్పాటు, Handloom Park పునరుద్ధించుట, New Powerloom క్లస్టర్ల అభివృద్ధి చేయుట, New Micro Handloom క్లస్టర్స్ ఏర్పాటు, National Centre for Designs ఏర్పాటుకు, State Technical Textile Policy రూపొందించుటకు తగు చర్యలు తీసుకొనుచున్నాం.
8) కేంద్ర ప్రభత్వంనుండి వివిధ పథకముల కింద రావాల్సిన బకాయిల మంజూరు కొరకు ప్రయత్నం చేయుచున్నాము.
Read also: Allu Arjun: చర్చగా మారిన అల్లు అర్జున్ నంద్యాల పర్యటన.. ఏంటి పుష్ప ఇది..?
9) 2023 బతుకమ్మ చీరల పథకము క్రింద టెస్కోకు చెల్లించవలసిన 351.52 కోట్లు గత ప్రభుత్వం చెల్లించలేదు, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి వరకు రూ.100 కోట్లు విడుదల చేయనైనది.
10) సమగ్ర శిక్ష 2023-24 పథకము కింద గత ప్రభుత్వం బకాయి ఉన్న రూ. 108 కోట్లు, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేయనైనది.
11) గత ప్రభుత్వం నవంబర్ 2023 వరకు సుమారుగా 488.38 కోట్లు వివిధ ప్రభుత్వశాఖలకు సరఫరాగావించబడిన వస్త్రముల బకాయిలు టెస్కోకు చెల్లించవలసి ఉన్నది.
12) రాష్ట్రం మొత్తంలో (140) మాక్స్ సొసైటీలు మరియు (135) SSI Units ఉన్నవి. వీటి యొక్క విద్యుత్ వినియోగం పరిశీలించిన తరువాత సుమారుగా ౩౦ శాతం బోగస్ సొసైటీలు ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారించడం అయినది.
13) గత ప్రభుత్వం చేనేత మిత్ర కార్మికుల పథకమును హడావిడిగా ప్రవేశ పెట్టడమైనది. ఇట్టి పథకమునకు కేబినెట్ ఆమోదము లేనందువలన నిధుల విడుదల జరగలేదు. ఇట్టి పథకము ప్రచారం నిమిత్తమే విడుదల చేసి చేనేత కార్మికులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేయటం జరిగినది.
14) గతములో వివిధ డిపార్ట్మెంట్ లకు సరఫరా గావించబడిన వస్త్రములకు సంబంధించి రవాణా నిమిత్తం చెల్లించబడిన నిధులలో కొన్ని వందల కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినట్టు ప్రాథమికముగా తేలినది. దీని మీద విజిలెన్స్ విచారణ కొరకు ఆదేశించటమైనది.
15) గతములో చేనేత వస్త్రముల పేరు మీద Powerloom వస్త్రములు కొనుగోలు చేయబడినట్టు ప్రాథమికముగా తేలినది. దీని వలన నిజమైన చేనేత కార్మికులకు నష్టము జరిగి మధ్య దళారులు లాభపడినారు. ఇట్టి విషయము పై ప్రత్యేక దృష్టిపెట్టి నిజమైన చేనేత కార్మికులకు లబ్ధి చేకూరే విధముగా, నిరంతరముగా పని కలిపించుట కొరకు చర్యలు తీసుకొనుట జరుగుతున్నది.
Read also: KTR: హామీలు అమలు చేయడంలో కాంగ్రె, బీజేపీ ప్రభుత్వాలు విఫలం
16) గత ప్రభుత్వం పెట్టిన బకాయిల వలన జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అసంబద్దమైన ఆరోపణలు చేస్తు, సహజ మరణాలు మొదలగు వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించి చేనేత కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొడుతున్నారు. భరోసా ఇవ్వాల్సింది పోయి, బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చేనేత కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే, అశాంతిని సృష్టించే ప్రయత్నాలు కొనసాగకుండా ఈ ప్రభుత్వం చేనేత కార్మకుల సంక్షేమం కోసం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
17) నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి, మంత్రి చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం రివ్యూ చేసి తాత్కలిక ప్రయోజనం కంటే దీర్ఘకాలిక లబ్ధి చేకూరేలా కార్మికులందరికి ఉపాధి దొరికేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతొంది. తాత్కలికమైన రాజకీయ లబ్ధికోసం ఈ ప్రభుత్వం కార్యక్రమాలను చేపట్టదు. కేవలం చేనేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధికోసం మాత్రమే ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. గత ప్రభుత్వం మధ్య దళారుల కోసమో, ఓట్ల కోసమో కార్యక్రమాలు చేయడం జరిగింది. అవి సరియైన ఫలితాలు ఇవ్వలేదు.
18) కాబట్టి నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత దీర్ఘకాలికంగా లబ్ధి చేకూరే పథకాల రూపకల్పన కోసం చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. దీనిలో భాగంగా నేత కార్మికుల స్వయం సమృద్ధి కొరకు నేతన్న భరోస అనే ప్రభుత్వ విధానాన్ని రూపోందించుటకు చర్యలు తీసుకుంటున్నాము. IIHT ఏర్పాటు, హ్యండ్లూమ్ టెక్స్ టైల్ పార్కు పునరుద్ధరణ, న్యూ పవర్ లూమ్ క్లస్టర్లను అభివృద్ధి చేయుట, న్యూ మైక్రో హ్యండ్ లూమ్ క్లస్టర్ల ఏర్పాటు, నేషనల్ సెంటర్ ఫర్ డిజైన్స్ ఏర్పాటుకు, స్టేట్ టెక్నికల్ టెక్స్ టైల్ పాలసీ రూపోందించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
Kishan Reddy: ప్రతిపక్షాలు కోడి గుడ్డు మీద ఈకలు పీకే విధానాన్ని అవలంభిస్తున్నాయ్..