చిరకాల మిత్రుడు అకస్మాత్తుగా కన్నుమూస్తే ఆ బాధ మామూలుగా వుండదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తన చిరకాల మిత్రుడు ఆకస్మికంగా మృతి చెందటంతో నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి కడవరకు సాగనంపారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సత్తుపల్లి పట్టణ ప్రముఖులు సత్తుపల్లి మాజీ ఉపసర్పంచ్, మాజీ కౌన్సిలర్ తుళ్లూరు ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు.
తుళ్లూరు ప్రసాద్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సన్నిహితులు. ఇద్దరూ ఎంతో స్నేహంగా మెలిగేవారు. ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర సంతాపం తెలిపారు. మిత్రుడితో అనుబంధాన్ని తలచుకున్నారు. వెంటనే బయలుదేరి వెళ్ళారు. ప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రసాద్ భౌతికకాయాన్ని తరలించే సమయంలో పాడే మోసి తనకు తన మిత్రుడితో ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు వెంట ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలువురు ప్రముఖులు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రసాద్ కు నివాళులర్పించారు.
Ktr Twitter: ఆ..ముగ్గురు అమ్మాయిలకు ప్రత్యేకంగా బెస్ట్ విషెస్