NTV Telugu Site icon

Tula Uma: బీఆర్ఎస్ లోకి తుల ఉమ.. కేసీఆర్ సమక్షంలో చేరిక

Tula Uma

Tula Uma

Tula Uma: నేడు మాజీ జెడ్సీ ఛైర్మెన్ తులఉమ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. నేడు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరే అవకాశం వున్నట్లు విశ్వనీయ సమాచారం. వేములవాడ బిజెపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ.. గత మూడు రోజులుగా తమ పార్టీలోకి రావాలి బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఆహ్వానించారు. కానీ.. బీఆర్ఎస్ కు వెళ్లేందుకు తుల ఉమ సిద్ధమైనట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా చర్చలు జరిపినట్లు సమాచారం. తుల ఉమ ఇంటికి.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ టీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు స్వయంగా వెళ్లి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో తుల ఉమ బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు తుల ఉమకు ఈ ప్రాంతంపై మంచి పట్టు ఉంది. చాలా కాలం పాటు బీఆర్‌ఎస్‌లో ఉన్న ఉమ చాలాకాలంపాటు కొనసాగిన తర్వాత బీఆర్‌ఎస్ వీడీ బీజేపీలో చేరారు. ఇదిలా ఉండగా తుల ఉమను పట్టుపట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కించుకున్న స్థానిక బీజేపీ నేత ఈటల పక్కన పెట్టడం గమనార్హం. దీంతో ఈటల తన సొంత నియోజకవర్గంలోనే బీజేపీ కార్యకర్తల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో వినోద్‌కుమార్‌, తుల ఉమతో సుదీర్ఘ చర్చలు జరిపినప్పుడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా లైన్‌లోకి వచ్చి ఒప్పించారని బీఆర్‌ఎస్‌ వెల్లడించింది. అయితే.. తుల ఉమ ఈరోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో తుల ఉమ మాట్లాడుతూ.. నేను ఏ పార్టీ లోకి వెళ్ళేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేయకండని అన్నారు. కొంత మంది నేను బీఆర్ఎస్ పార్టీ లోకి వెళ్తున్నట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని తెలిపిన విషయం తెలిసిందే. అలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి అని మండిపడ్డారు. మీడియాలో వచ్చిన కథనాలు తప్పు, నమ్మకండి ప్రజలారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ కి వెళ్తున్నట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నేను ఇప్పటి వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. నన్ను నమ్ముకున్న వారు ఉన్నారు, వారి నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుంటాను, నా ఒక్క దాని కోసం నిర్ణయం తీసుకోను అని తుల ఉమ క్లారిటీ ఇచ్చారు. కొంత మంది కావాలనే బదనాం చేస్తున్నారని అన్నారు. పార్టీల వారు రమ్మని అడిగారు అంతే..అని తెలిపారు. నేను ఇప్పటికే చాలా నష్టపోయాను, మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదన్నారు. ఇప్పుడు తీసుకొనే నిర్ణయం అందరికీ ఉపయోగ పడే విధంగా ఉంటుందని తుల ఉమ అన్నారు. భవిష్యత్ లో నేను రాజకీయాల్లో కీలకంగా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
Tiger 3 : దుమ్మురేపిన టైగర్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్..