Tiger 3 : దుమ్మురేపిన టైగర్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3 .. దీపావళి కానుకగా నిన్న గ్రాండ్ గా విడుదల అయిన ఈ మూవీ ఊహించినట్లే తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది.తొలి రోజు ఏకంగా రూ.44.5 కోట్లు వసూలు చేసింది.. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ కలెక్షన్ల పరంపర ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.టైగర్ 3 మూవీ బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన దీపావళి సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు..ఈ సినిమా యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చింది. మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన టైగర్ 3 సినిమా ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ ధీమాగా వున్నారు..
టైగర్ 3 మూవీకి దీపావళి రోజు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా సాగాయి. ఆ లెక్కన తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే ఉంటాయని ట్రేడ్ అనలిస్టులు కూడా ఓ అంచనాకు వచ్చారు. ఊహించినట్లే తొలి రోజు ఈ సినిమా ఇండియాలోనే అన్ని భాషల్లో కలిపి రూ.44.5 కోట్లు వసూలు చేసింది.ఇండియాలోనే టైగర్ 3 మూవీ 5500 స్క్రీన్లలో విడుదల అయింది… ఇక విదేశాల్లో 3400 స్క్రీన్లలో వచ్చింది. అయితే హిందీలో ఈ సినిమా ఆక్యుపెన్సీ రేషియో మాత్రం కేవలం 41 శాతంగానే ఉంది. ఏక్ థా టైగర్ మరియు టైగర్ జిందా హై వంటి భారీ మూవీస్ తరహాలో ఈ టైగర్ 3 సినిమా వచ్చింది. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ విషయానికి వస్తే అందులో ఆ రెండు సినిమాలతోపాటు వార్, పఠాన్ లు కూడా ఉన్నాయి.ఈ సినిమాలో అవినాష్ పాత్రలో సల్మాన్ అలాగే జోయా పాత్రల్లో కత్రినా నటించారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ మరియు హృతిక్ రోషన్ కూడా అతిథి పాత్రల్లో కనిపించడం విశేషం.ఈ సినిమాకు ప్రీతమ్ మ్యూజిక్ అందించాడు. టైగర్ 3 మూవీని మేకర్స్ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ లో నిర్మించిన బిగ్గెస్ట్ ఫిల్మ్ గా టైగర్ 3 నిలిచింది…
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!