NTV Telugu Site icon

Gruha Jyothi Scheme: అద్దెకు ఉండేవారికి గుడ్‌న్యూస్.. కరెంట్‌ బిల్లుపై TSSPDCL క్లారిటీ..!

Gruha Jyothi Scheme

Gruha Jyothi Scheme

Gruha Jyothi Scheme: ఆరు హామీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు హామీలు అమలు చేశారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. తాజాగా ఈ పథకానికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఈ నెల 8న జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ‘గృహ జ్యోతి’ పథకానికి అర్హతలు, మార్గదర్శకాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఇంటికి ఒక మీటరు మాత్రమే పథకం అమలు చేస్తామని చెబుతున్నా.. అద్దెకు ఉంటున్న వారు అర్హులేనని అంటున్నారు.

Read also: Uniform Civil Code Bill: యూసీసీ బిల్లు ఖురాన్‌కు విరుద్ధమైతే వ్యతిరేకిస్తాం..

200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే గృహ వినియోగదారులే అర్హులని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక కస్టమర్ గత సంవత్సరం 1500 యూనిట్లను ఉపయోగించినట్లయితే, 10 శాతంతో పాటు 1650 యూనిట్లను 12 నెలలతో భాగిస్తే నెలకు 137 యూనిట్లు ఉచితం. ఒకవేళ దానిపైబడి వాడితే బిల్లు తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL ఈ పోస్ట్‌పై ట్విట్టర్ X లో అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పైన పేర్కొన్నవన్నీ అబద్ధమని వారు నమ్ముతున్నారు. గృహజ్యోతి పథకానికి అద్దె ఇళ్లలో ఉంటున్న వారు కూడా అర్హులేనని స్పష్టం చేశారు. ఎవరూ తప్పుదోవ పట్టించవద్దని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ అధికారులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు.
Ambajipeta Marriage Band : “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ” ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?