Site icon NTV Telugu

VC Sajjanar: మహాలక్ష్మి- ఫ్రీ బస్సు ఫథకం.. త్వరలో 2050 కొత్త బస్సులు

Vc Sajjanar

Vc Sajjanar

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి- ఫ్రీ బస్సు ఫథకానికి ఊహించని స్పందని వస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రతిరోజూ 30 లక్షలకు పైగా మహిళలు ఈ పథకాన్ని వినియోగిస్తున్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించారు. మహిళల ఉచిత ప్రయాణ స్కీం ఫలితంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా.. ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగింది.

Also Read: New criminal laws: మూకదాడికి పాల్పడితే ఇక మరణశిక్షే.. దేశద్రోహ చట్టానికి ఇక చెల్లు..

ఈ నెల 16వ తేదిన 17 డిపోలు, 17వ తేదిన 20 డిపోలు, 18వ తేదిన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదయింది. ఉచిత బస్సు ప్రయాణానికి ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్ బస్సుల్లో కొందరు ప్రమాదకర రీతిలో ప్రయాణం చేస్తున్నట్లు సంస్థ దృష్టికి వచ్చింది. అటువంటి ప్రయాణం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా చివరి ట్రిప్పు బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణంతో పాటు వెనుక లాడర్ పైన ఎక్కి ప్రయాణిస్తున్నారు. ఇది ప్రమాదం. ప్రాణాలను పణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సరికాదు. రద్దీ సమయాల్లో తమ సిబ్బందికి సహకరించాలని ప్రయాణికులను కోరారు’ అని పేర్కొన్నారు.

త్వరలో 2050 కొత్త బస్సులు
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చే ప్లాన్ చేస్తున్నామన్నారు. అందులో 1050 డీజిల్.. 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. . విడతల వారీగా ఆ బస్సులు వాడకంలోకి వస్తాయని చెప్పారు. అలాగే ఆటో డ్రైవర్ల సమస్యలపై కూడా ఆయన స్పందించారు. ఆటో డ్రైవర్ల ఆందోళన ప్రభుత్వం దృష్టిలో ఉందని, వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ షో ఫైనల్స్ తరువాత అభిమానులు ఆర్టీసి బస్సు అందాలను పగలగొట్టిన ఘటనపై ఆయన మండిడ్డారు.

Also Read: Prithviraj Sukumaran: ప్రభాస్ లో నాకు అదే నచ్చలేదు.. చాలా డేంజరస్ పర్సన్

బిగ్‌బాస్-7 ఫైనల్ తర్వాత హైదదాబాద్‌ లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో ఆరు బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. బిగ్ బాస్ షో ఫైనల్స్ తరువాత కొందరు ప్రభుత్వ ఆస్థికి నష్టం కలిగించారని, అది నేరం.. అందుకే వారిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకున్నామన్నారు. వినోదం కోసం ఇలాంటి షోలు చూడండి.. కానీ ఇటువంటి చర్యలు మంచివి కాదని ఆయన హెచ్చరించారు.

Exit mobile version