NTV Telugu Site icon

TSRTC: కారుణ్య నియామ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్.. వారికే ప్రాధాన్యం

Sajjanar

Sajjanar

తెలంగాణ ఆర్టీసీ కారుణ్య నియామకాలకు గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల ఉత్తర్వులను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ జారీ చేశారు. సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలు కొన్నేళ్లుగా కొలువుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే డ్యూటీ చేస్తు గుండెపోటు లేదా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబాలనికి ముందుగా కొలువులివ్వాలని నిర్ణయించింది. గ్రేడ్ 2 డ్రైవర్ పోస్టుకు రూ. 19,000లు, కండక్టర్ గ్రేడ్ 2 పోస్టుకు రూ.17,000లు, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టుకు రూ.15000, శ్రామిక్ పోస్టులను రూ. 15,000 కాన్ సాలెటెడ్ జీతంగా ఇవ్వనున్నట్లు ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. పెండింగ్ దరకాస్తులను పరిగణలోకి తీసుకుని దశల వారీగా తక్షణమే నియామకాలు చేపడతామని ప్రకటించారు.

read also: Heavy Rains: పలు రాష్ట్రాల్లో నేడు అతిభారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

కారుణ్య నియామకం కింద ఎంపికైన వారు మూడేళ్లపాటు ఏకమొత్తం వేతనం కింద సర్వీసు పూర్తీ చేసిన వారికి పనితీరు అంచనా పరీక్ష నిర్వహించి.. అందులో 60శాతం మార్కలు సాధిస్తే.. పూర్తి స్థాయి స్కేలు మేరకు సర్వీసులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే ఈమూడేళ్ల వ్యవధిలో నియమితులైన ప్రతి ఉద్యోగి ఏటా కనీసం 240 రోజులు పనిచేసి ఉండాలని తెలిపారు. కాగా.. ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకున్న కారుణ్య నియామక అర్హులకు లేఖలు పంపుతామని, వారు ఉద్యోగంలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చాక రీజినల్ మేనేజర్లు ఖాళీల మేరకు నియామక ప్రక్రియను చేపతామని సజ్జనార్ పేర్కొన్నారు.

India vs England : దుమ్ములేపిన హర్దిక్‌ పాండ్యా.. భారత్ ఘన విజయం