Site icon NTV Telugu

TSRTC Bumper Offer: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. ఇకపై ఆ చార్జీలుండవ్..

Dajjanar

Dajjanar

TSRTC Bumper Offer: తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా సమీపంలోని పర్యాటక ప్రదేశాలు, పవిత్ర స్థలాలకు వెళుతుంటారు. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వచ్చిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రహదారులపై రద్దీ నెలకొంది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు వాహనదారులు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవి మరింత భారంగా మారుతున్నాయి.

Read also: Amit Shah: రూల్స్ బ్రేక్ చేశారు.. అమిత్ షా పై కేసు నమోదు..

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు బఫర్ ఆఫర్ ప్రకటించింది. సిటీకి వెళ్లాలనుకునే వారు.. ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే.. ఎలాంటి రుసుము లేదని వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎనిమిది రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి రిజర్వేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు లభించడం విశేషం. ఈ మేరకు ఎక్స్ ట్వీట్ చేసింది. #TSRTC సుదూర ప్రయాణీకులకు రిజర్వేషన్ ఛార్జీలను మాఫీ చేస్తుంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది.

Read also: Rahul Gandhi: రాయ్‌బరేలీలో పోటీ చేయడంపై వయనాడ్‌ ప్రజలు ఏమంటున్నారంటే..!

TSRTC బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించండి” అని ఆయన ట్వీట్ చేశారు. యాత్రికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా అడ్వాన్స్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌లకు 10 శాతం రాయితీ ప్రకటించింది. ఇప్పుడు ఈ ఆఫర్ ఇచ్చారు. ఏపీలోని శ్రీశైలంలో కూడా బస్సు సర్వీసులు, ఫ్రీక్వెన్సీ పెంచనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఉచిత బస్సు అమల్లోకి వచ్చినప్పటి నుంచి అనేక మంది పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
AP Pensions: నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు

Exit mobile version