Srisailam Darshan: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. RTC బస్ టికెట్‌తో పాటే దర్శన టికెట్ బుకింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Darshan: హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు తీసుకునే వారికి శ్రీశైలం ఆలయంలో దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. 1,200 రోజువారీ దర్శన టిక్కెట్లు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 200 స్పర్శ దర్శనం టిక్కెట్లు, 500 సూపర్ క్విక్ దర్శన్ టిక్కెట్లు, మరో 500 క్విక్ దర్శనం టిక్కెట్లు ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఆర్టీసీ మధ్య ఎంవోయూ కుదిరింది. స్పర్శ దర్శనం టిక్కెట్ ధర రూ.500, శీఘ్ర దర్శనం ధర రూ.300, శీఘ్ర దర్శనం ధర రూ.150 అని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 100 కొత్త బస్సులను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
Read also: Lord Surya Stotram: ఈ స్తోత్రాలు వింటే ఐశ్వర్యం కలిగేలా ఆదిత్యుడు ఆశీర్వదిస్తాడు
Also Read
90 ఎక్స్‌ప్రెస్ బస్సులు, 10 సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన 60 రోజుల్లోనే 15 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. మహిళలతో కలిసి రూ.535 కోట్ల చెక్కును టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు ముఖ్యమంత్రి అందజేశారు. హైదరాబాద్-శ్రీశైలం మధ్య 10 సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు తిరుగుతాయని.. వారం రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.540. ఎంజీబీఎస్ నుంచి రూ.700, రూ.510లను ఆర్టీసీ ఖరారు చేసింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రతి 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఒక సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్ ఎం శ్రీధర్ తెలిపారు.
Surya Stotram: ఆయురారోగ్య ప్రాప్తి, సకల సౌభాగ్యాలకు ఈ స్తోత్ర పారాయణం చేయండి
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!