TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు 13 మందిని సిట్ అదుపులో తీసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజశేఖర్ బావ ప్రశాంత్ ను సిట్ అరెస్టు చేశారు. గ్రూప్ వన్ పరీక్ష రాసిన ప్రశాంత్ కి వందకు పైగా మార్కులు వచ్చినట్లు సిట్ విచారణలో వెల్లడి కావడంతో ప్రశాంత్ ను అదుపులో తీసుకున్నారు. దీంతో నిన్నటి వరకు 12 మందిని అదుపులో తీసుకోగా.. ఇవాల అదుపులో తీసుకున్న ప్రశాంత్ రెడ్డితో కలిపి 13కు చేరింది. దర్యాప్తులో భాగంగా రాజశేఖర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశాంత్ ను అరెస్టు చేసిన సిట్. ప్రశాంత్ నవాబు పేట్ ఎంపీడీఓ ఆఫీసులో కాంట్రాక్ట్ ఉద్యోగా పనిచేస్తున్నారు. మహబూబ్ నగర్ లోనే ప్రశాంత్‌ను సిట్ బృందం విచారిస్తుంది.
Read also: Shocking Incident : 20ఏళ్లప్పుడు దొంగతనం చేసి.. 60ఏళ్లకు అరెస్టయ్యారు
నిందితులు ఎవరెవరు ఎక్కడివారు?
A1 పులిదిండి ప్రవీణ్ కుమార్.
టీఎస్‌పీస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆపీసర్, సెక్రటరీకి పీఏ. సొంతూరు ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి.
A2 రాజశేఖర్‌రెడ్డి.
టీఎస్‌పీఎస్సీలో నెట్ వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్నాడు. సొంతూరు జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామం.
A3 రేణుకా రాథోడ్.
సాంఘిక సంక్షేమ పాఠశాలలో హిందీ టీచర్. సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ పంచంగల్ తండా.
A4 లావుడ్యావత్ ఢాక్యా.
వికారాబాద్ R&Dడిపార్టుమెంటులో టెక్నికల్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ పంచంగల్ తండా.
A5 కేతావత్ రాజేశ్వర్.
వ్యవసాయం చేస్తుంటాడు. సొంతూరు మన్సూర్ పల్లి తండా, గండీడ్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
A6 కేతావత్ నీలేష్ నాయక్.
పుణెలో సైట్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. సొంతూరు మన్సూర్‌పల్లి తండా, గండీడ్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా.
A7 పత్లావత్ గోపాల్ నాయక్.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. స్వగ్రామం పులిచర్లకుంట తండా, బొమ్రాస్ పేట మండలం, వికారబాద్ జిల్లా.
A8 కె.శ్రీనివాస్.
మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. సొంతూరు మన్సూర్‌పల్లి తండా, గండీడ్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా.
A9 కేతావత్ రాజేందర్ నాయక్.
పుణెలో స్వయం ఉపాధి కింద రకరకాల పనులు చేస్తుంటాడు. సొంతూరు మన్సూర్‌పల్లి తండా, గండీడ్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా.
A10 షమీమ్.
TSPSCలో ASOగా పనిచేస్తున్నాడు. ఉండేది గుంటిజంగయ్య కాలనీ, ఎల్బీనగర్, హైదరాబాద్.
A11 నాలగొప్పుల సురేష్.
స్టూడెంట్. సొంతూరు పోతారం విలేజ్, తరిగొప్పుల మండలం, జనగామ జిల్లా.
A 12 దామెర రమేష్ కుమార్.
TSPSC ఆఫీసులో డాటా ఎంట్రీ ఆపరేటర్. స్వగ్రామం కోమటిపల్లి, మంగపేట మండలం, ములుగుజిల్లా.
A 13 ప్రశాంత్, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటకు.
వీరిలో A1 నుంచి A 9 వరకు పేర్కొన్న నిందితులు మార్చి 13న అరెస్టయ్యారు. A10 షమీమ్, A11 సురేష్, A12 రమేశ్ మార్చి 22న అరెస్టయ్యారు. వారిని మార్చి 18న పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. A 13 ప్రశాంత్ ఇవాళ (25)న అరెస్టు అయ్యాడు.
Read also: KK Raju: కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలి
సాక్షులు వీళ్లే..
ఇక.. మొత్తం 19 మందిని సాక్షులుగా సిట్ తేల్చింది. ఈ సాక్షుల్లో శంకరలక్ష్మీ TSPSC కాన్ఫిడెన్షియల్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్. ఇక.. సత్యనారాయణ TSPSC అడ్మిన్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీ కాగా.. అనురాజ్ TSPSCలో జూనియర్ అసిస్టెంట్, ఇక హరీష్ కుమార్, TSPSCలో సాఫ్ట్ వేర్ డెవలపర్ కాగా.. ఎస్.కే ముజాహిద్, ఆర్ స్క్వేర్ హోటల్లో సీసీ కెమెరా విభాగంలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. ఇక ప్రశాంత్, ఆర్ స్క్వేర్ హోటల్లో రిసెప్షనిస్ట్, A6, A7 నిందితులకు గదిని కేటాయించాడు.
రాఘవేందర్ రెడ్డి ఆర్ స్క్వేర్ హోటల్ యజమాని.
అనిల్ కుమార్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్.
విజయ్ కుమార్ డీఈవో ఆఫీసులో జూనియర్ అసిస్టెంటు.
పూజారి నరేందర్, బసంత్. ఇద్దరూ కూడా పంచాయతీ సెక్రటరీలే..
PAK vs AFG : పాకిస్తాన్ కి షాకిచ్చిన ఆఫ్ఘానిస్తాన్..
