Site icon NTV Telugu

TSPSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో నోటిఫికేషన్‌ వచ్చేసింది..

Tspsc

Tspsc

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. మరో నోటిఫికేషన్‌ జారీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్పీ)… ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.. ఈ నెల 29వ తేదీన నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఆప్లికేషన్‌ చేసుకునే అవకాశం కల్పించింది.. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పేర్కొంది.. అంటే అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్.. www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక, అభ్యర్థుల ఇతర పూర్తి వివరాలు.. ప్యూచర్‌ డిటైల్స్‌ కోసం.. తమ వెబ్‌సైట్‌ను చూడాల్సిందిగా తన ప్రకటనలో పేర్కొంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.

Read Also: Draupadi Murmu As 15th President: కేసీఆర్‌కి ఇది చీకటి రోజు

కాగా, అసెంబ్లీ వేదికగా ఉద్యోగల భర్తీ ఉంటుందని ప్రకటించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. ఆ తర్వాత కొంత గ్యాప్‌ వచ్చిన.. క్రమంగా కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వస్తుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. మరోవైపు, టీచర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని భావిస్తోన్న సర్కార్.. దానికి అనుగుణంగా.. టెట్‌ పరీక్షను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.. ఓవైపు నిరుద్యోగ సమస్యపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న సమయంలో.. వరుసగా ఉద్యోగాల భర్తీకి పూనుకుంది టీఆర్ఎస్‌ ప్రభుత్వం.. ఇప్పటికే పలు వేదికల మీదు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసిన ఉద్యోగాలు.. భర్తీ చేయబోతున్న ఉద్యోగాలపై కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version