నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సిద్ధమవుతోంది… గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదలపై వివిధ శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం నిర్వహించింది.. గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కింద 663 ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. దాదాపు 50 డిపార్ట్‌మెంట్లలో గ్రూప్-III సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కింద 1373 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో.. వీలైనంత త్వరగా నోటిఫికేషన్‌లను జారీ చేసే ప్రయత్నంలో టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పడిపోయింది..
Read Also: APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. 20 శాతం ఛార్జీలు తగ్గింపు..
అన్ని విభాగాల హెచ్‌వోడీలతో సమావేశం అయ్యారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు.. ఇండెంట్ ఫార్మాట్, అనవసరమైన వ్యాజ్యాలు, జాప్యాలను నివారించడానికి ముఖ్యమైన ఖాళీ వివరాలను అందించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరించింది.. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన సుమారు 100 మంది అధికారులు హాజరయ్యారు.. ఇండెంట్‌లలోని సమస్యలు, సర్వీస్ రూల్స్, సవరణలు/క్లారిఫికేషన్‌లు, రోస్టర్‌లు, క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు, అర్హతలు తదితర వివరాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు.ర. కమిషన్ త్వరితగతిన నోటిఫికేషన్‌లను జారీ చేయడానికి వీలుగా అన్ని సంబంధిత వివరాలతో పూర్తి ఫార్మాట్ లో ఇండెంట్‌లను వీలైనంత ముందుగా అందించాలని అన్ని శాఖలను కోరింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.