NTV Telugu Site icon

TSPSC Exams Cancel: పేపర్ లీక్ వ్యవహారం.. నాలుగు పరీక్షలు రద్దు

Tspsc Exams Cancelled

Tspsc Exams Cancelled

TSPSC Cancelled Four Exams: ప్రశ్నాపత్రం లీకైన నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్‌సీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈ (అసిస్టెంట్ ఇంజినీర్), ఏఈఈ(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), డీఏవో(డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్స్) పరీక్షలను రద్దు చేసింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప‌రీక్షను ఈ ఏడాది జూన్ 11వ తేదీన మళ్లీ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ పరీక్షల్ని గతేడాది అక్టోబర్ 16వ తేదీన నిర్వహించగా.. మొత్తం 2 క్షల 86 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. ఏఈఈ ప‌రీక్షలను ఈ ఏడాది జ‌న‌వ‌రి 22న‌ నిర్వహించారు. 1540 పోస్టులకు గాను 61 వేల మంది పరీక్షలు రాశారు. డీఏవో ఎగ్జామ్‌ను ఫిబ్రవ‌రి 26న నిర్వహించగా.. 53 పోస్టులకు ఏకంగా 67 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక 837 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు గాను ఈనెల 5వ తేదీన పరీక్షలు జరగ్గా.. 55 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Sonali Kulkarni: అమ్మాయిలకు అది ఎక్కువైంది.. అవసరాలు తీర్చే బాయ్ ఫ్రెండ్ కావాలి

ప్రస్తుత పరిణామాలపై శుక్రవారం ఉదయం సమావేశమైన టీఎస్‌పీఎస్‌సీ.. సిట్ నివేదిక, అంతర్గత విచారణను పరిగణనలోకి తీసుకొని.. ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు నిర్నయం తీసుకుంది. ఇప్పటికే టీపీబీవో, వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ ప‌రీక్షల‌ను టీఎస్‌సీఎస్‌సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. 175 పోస్టులకు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, 185 పోస్టులకు వేటరినరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల్ని వాయిదా వేశారు. మరోవైపు.. మరికొన్ని పరీక్షలు ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉన్నాయి. హార్టికల్చర్ ఆఫీసర్స్ పరీక్షల్ని ఏప్రిల్ 4వ తేదీన జరగనుండగా.. ఏప్రిల్ 23న ఏఎంఐవీ, జులై 1న గ్రూప్ 4 (8180 పోస్టులకు 9 లక్షల దరఖాస్తులు), ఆగస్టు 29, 30వ తేదీల్లో గ్రూప్ 2 (783 పోస్టులకు గాను 5 లక్షల 50 వేల దరఖాస్తులు) పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్ 3 (1375 పోస్టులకు 5 లక్షల 36 వేల దరఖాస్తులు) పరీక్షల తేదీ ఇంకా వెల్లడి కావల్సి ఉంది.

Tarun Chugh: కేసీఆర్ మోసాన్ని బీజేపీ నగ్నంగా బయటపెడుతుంది.. తరుణ్ చుగ్ ప్రకటన

Show comments