తెలంగాణలో ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించబోమని రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు అధికారులు. పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. ఉదయం పది గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తామని తెలిపారు అధికారులు. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, వాచీలు, క్యాలిక్యులేటర్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకరాకుడదని సూచించారు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు.
Read Also: Suman Birthday : సుమన్ ఏమనెన్!?
ఈ రోజు పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖ కానిస్టేబుల్ ఎంపిక ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి రిక్రూట్‌మెంట్ బోర్డు రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 35 పట్టణాల్లో మొత్తంగా 1,601 కేంద్రాలను ఏర్పాటు చేసింది. సివిల్ కానిస్టేబుల్ కోటాలోని 15,644, రవాణా శాఖలో 63, అబ్కారీశాఖలో 614 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తుండగా.. మొత్తం 6.61 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది.. అభ్యర్థులు పరీక్షా సమయానికి గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.. నిర్ణీత సమయాని కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.. మరోవైపు, ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై నిర్దేశించిన ప్రాంతంలో పాస్‌పోర్టు సైజు ఫొటో అతికించుకుని రావాలని, అలా చేయకపోతే లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు అధికారులు.. ఇక, ఎగ్జామ్ సెంటర్‌లోకి బ్యాగులు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలేవీ అనుమతించబోరు..
