Site icon NTV Telugu

TS State Emblem: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఇదేనా..? ఫొటో వైరల్..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

TS State Emblem: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేస్తుంది. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర చిహ్నంలో రాజ చిహ్నాలు ఉండకూడదని ఆదేశించిన తర్వాత, పెయింటర్ రుద్ర రాజేష్ అనేక నమూనాలను ప్రభుత్వానికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేందుకు, అమరవీరుల త్యాగాలను చాటిచెప్పేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని సీఎం రేవంత్ ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ఆ మేరకు నాలుగైదు నమూనాలను కూడా పరిశీలించారు. అయితే వీటిలో ఏది ఫైనల్ అవుతుందనేది సస్పెన్స్ గా మారింది.

Read also: Monsoon : సమయానికి ముందే కేరళను తాకిన రుతుపవనాలు..చాలా చోట్ల వర్షాలు

తెలంగాణ ప్రభుత్వ పరిశీలనలో మరికొన్ని అధికారిక చిహ్నాలు ఉన్నట్లు సమాచారం. రుద్రరాజేశం పలు రకాలుగా లోగోలు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ మ్యాప్లో బతుకమ్మ, చార్మినార్, రాజముద్రలో ఒక లోగో తయారీ చేశారు. తెలంగాణ మ్యాప్లో బతుకమ్మ, అమరవీరుల స్థూపంతో మరో లోగో డిజైన్ చేసినట్లు విశ్వనీయ సమాచారం. దీంతో.. అమరవీరుల స్థూపం, రాజముద్రలో మరో లోగో వైరల్ గా మారింది. అన్ని లోగోలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆవిర్భావ దినోత్సవం రోజు లోగోను రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. లోగో ఖరారుపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ ఇవాళ చర్చించనున్నారు. పార్టీ నేతలతో భేటీ తర్వాత ఇవాళ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసే అవకాశాలున్నాయి.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏకంగా 1200 మంది..!

Exit mobile version