Site icon NTV Telugu

Ts Si Prelims Exam Postponed: ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా..!

Ts Si Prelims Exam Postponed

Ts Si Prelims Exam Postponed

రాష్ట్రంలో ఆగస్టులో పోలీసు కొలువులకు పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అధికారులు షోడ్యూల్‌ ప్రకారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రామంలో.. ఆగస్టు 7న జరగాల్సిన కమిసన్‌ కు సంబధించిన అసిస్టెంట్‌ కమాండెంట్‌, ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పరీక్షలు ఉన్నాయి. కాగా.. ముఖ్యంగా యూపీఎస్సీ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ రెండేళ్లకోసారి విడుదల చేస్తారు. కాగా.. ఎస్‌ఐ పరీక్షకు ఆప్లై చేసుకున్నవారిలో 20వేలకు పైగా అభ్యర్థులు , ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ, అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులకు అప్లై చేసుకోవడంతో నిరుద్యోగ యువకులు ఆందోళనకు గురవుతున్నారు. చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీపడి చదువుతున్న తమకు ఒకేసారి రెండు పోస్టులకు పరీక్ష నిర్వహించడం ద్వారా నష్టపోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

read also: CM YS Jagan: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సీఎం.. 2,61,516 మందికి లబ్ధి

ఆర్‌ఆర్‌బీ, అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు దేశవ్యాప్తంగా జరుగుతాయి. అయితే ఎలాగైనా ఎస్‌ ప్రలిమ్స్‌ రాత పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈనేపథ్యంలో.. ఎస్‌ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన, కానిస్టేబుల్‌ పరీక్షను అదేనెల ఆగస్టులో 27వ తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన హాల్‌ టికెట్లను www.tslprb.in వెబ్‌ సైట్లో డౌన్లోడ్‌ చేసుకోవచ్చని తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్మంట్‌ బోర్ద్‌ అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే.

WhatsApp: త్వరలో మరో క్రేజీ అప్డేట్.. ఫిదా అవ్వాల్సిందే!

Exit mobile version