Grama Panchayathi: పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grama Panchayathi: ఈ నెల 31తో సర్పంచ్ల పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్లు ప్రభుత్వానికి జాబితాలను పంపారు. ఈ నెల 30న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనుండడంతో.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో కాకుండా ప్రత్యేక అధికారులతో ప్రజా పాలన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు రానున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం (మిషన్ భగీరథ) అసిస్టెంట్ ఇంజనీర్లు, సమగ్ర శిశు అభివృద్ధి సేవల (ఐసీడీఎస్) సూపర్వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, వెటర్నరీ అధికారులు, ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు, ఉద్యానవనశాఖ అధికారులు, పంచాయతీల్లో సబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, టైపిస్టులు, గెజిటెడ్ హెడ్మాస్టర్లు, హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు.
Also Read
Read also: Budget 2024 : ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్.. 10 లక్షల మందికి ఉద్యోగాలు
కాగా.. ఆయా మండలంలోని పంచాయతీల సంఖ్యను బట్టి ఇతర శాఖల అధికారుల సేవలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మండలాలు చిన్నవి కావడంతో ఇతర శాఖల అధికారుల సేవలు తక్కువ సంఖ్యలోనే అవసరమని భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నందున వీటికి అవసరమైన నియామకాలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్లు నిర్ణీత నమూనాలో జాబితాలను రూపొందించారు. ప్రతి అధికారి హోదా ఒక గ్రామానికి ప్రత్యేక అధికారి. సెల్ ఫోన్ నంబర్, వారు నిర్వహించే విభాగం సమాచారం. 12 వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది అవసరమని, ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవులో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్లకు సూచించారు. ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఈ నెల 29న ఉత్తర్వులు జారీ చేయనున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
-
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
-
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
-
The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. ‘ది పారడైజ్’ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!