TS Inter Supplemetary: నేటి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Inter Supplemetary: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇవాల్టి నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగగా.. సెకెండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు జరుగనున్నాయి. కాగా.. ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఇక విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read also: TS Polycet 2024: నేడే పాలీసెట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ఇంటర్మీడియట్ విద్యార్థులకు థియరీ పరీక్షలు ముగిశాక మళ్లీ జూన్ 4 నుంచి 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 వరకు మొదటి సెషన్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అంతేకాకుండా.. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జూన్ 10న ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచి పరీక్ష నిర్వహిస్తారు. కాగా.. ఇంటర్నల్ పరీక్షలకు సంబంధించి.. జూన్ 11న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష.. జూన్ 12న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగనున్నాయి.
Read also: SRH vs RR Qualifier 2: నేడు క్వాలిఫయర్-2.. ఫైనల్‌కు వెళ్లేదెవరో!
షెడ్యూల్ ఇదీ..
* 24 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1.
* మే 25 ఇంగ్లీష్ పేపర్-1.
* మే 28 గణితం పేపర్-1ఏ, బొటాని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1.
* మే 29 మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1.
* మే 30 ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1.
* మే 31 కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1.
* జూన్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 (BIPC విద్యార్థుల కోసం).
* జూన్ 3 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1.
Read also: Off The Record : రాజమండ్రిలో ఆ అభ్యర్థి గెలిస్తే పార్టీ ఓడిపోవడం ఆనవాయితీ..?
ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షల షెడ్యూల్..
* మే 24 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2.
* మే 25 ఇంగ్లీష్ పేపర్-2.
* మే 28 మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ, బోటానీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2.
* మే 29 మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
* మే 30 ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2.
* మే 31 కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2.
* జూన్ 1 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (BIPC విద్యార్థుల కోసం).
* జూన్ 3 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2.
Kerala Rains: కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం.. పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!