TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రథమ, ద్వితీయ ఫలితాలను విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫలితాల కోసం ntvtelugu.com వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించవచ్చు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ 4,33,082 మంది హాజరు కాగా 2,72,208 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 3,80,920 మంది హాజరు కాగా 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించి 67.27 శాతం నమోదైంది. ఇంటర్మీడియెట్ లో ఫస్టియర్ లో 63.85 శాతం ఉత్తీర్ణత కాగా.. అమ్మాయిలు 68.85 శాతం పాస్ అయ్యారు. ఇక అబ్బాయిలు 56.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండియర్ లో 67.26 శాతం పాస్ అయ్యారు. సెకండియర్ లో అమ్మాయిలు 73.46 శాతం పాస్ అయ్యారు. ఇక అబ్బాయిలు 60.66 శాతం పాస్ అయ్యారు.
ఈరోజు 2022-23 ఫలితాలను విడుదల చేసామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించామని, విద్యార్థి దశలో ఇంటర్ కీలకమన్నారు. జీవితానికి టర్నింగ్ పాయింట్ అని తెలిపారు. మన రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ పరీక్షలకు 9,45,153 మంది హాజరయ్యారని తెలిపారు. 1473 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. 26 వేల మంది సేవలందించారని తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అన్ని శాఖలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విషయంలో ఇంటర్ వెయిటేజీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలెవరూ ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
తాజావార్తలు
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?