TS EAMCET 2022 Schedule.
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్‌ను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణలో వ్యవసాయ, ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్.. అదేవిధంగా పీజీలో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్ నిర్వహణ తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. జులై రెండో వారం నుంచి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
అదేవిధంగా జులై 13న ఈసెట్ నిర్వహించననున్నట్లు ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పటికే జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ తేదీలు మారడంతో ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు కూడా ఇటీవలే మార్చారు. దీంతో ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్ వాయిదా పడింది. మే 24 దాకా ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.
