మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడో రోజు శాసనసభలో కీలకమైన బిల్లులతో పాటు కేంద్రానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇక మూడో రోజు సైతం ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే కేంద్ర విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ.. కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ రెండు తీర్మానాలను ప్రవేశపెడతారు. వాటిపై చర్చించి ఆమోదం తెలుపుతారు. ఇక శాసనసభలో ఏడు బిల్లులపై చర్చించి ఆమోదం తెలియజేస్తారు. ఆ తర్వాత ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమలులో కేంద్రం ద్వంద్వ విధానం రాష్ట్ర ప్రగతిపై ప్రభావం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై ఉభయ సభల్లో రెండు స్వల్పకాలిక చర్చలు జరుపుతారు. ఈరోజు రాత్రి వరకు సమావేశాలు జరిగే వీలుంది.