Kishan reddy: మునుగోడులో బీజేపీదే నైతిక విజయమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ‘ప్రలోభాలు, బెదిరింపులతో TRS గెలిచింది. సీఎం, మంత్రులు ఇంఛార్జ్ లుగా వ్యవహరించారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. డిపాజిట్ రాని స్థితి నుంచి రెండోస్థానంలోకి వచ్చామన్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తాం. హుజురాబాద్, దుబ్బాకలో గతంలో డిపాజిట్ లేకున్నా ఇటీవల గెలిచాం. మునుగోడుపై భయపడం. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం’ అని స్పష్టం చేశారు.
Read also: Palvai Sravanthi: పాల్వాయి స్రవంతి ప్రెస్ మీట్.. ఓటమిపై చర్చ?
మునుగోడులో ఎన్నికల్లో అన్ని అక్రమాలకు టీఆర్‌ఎస్ పాల్పడిందని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి.. మంత్రులు. ఎమ్మెల్యేలు ..ఎమ్మెల్సీలు. బూత్ ఇంచార్జ్ లుగా వ్యవహరించారని విమర్శించారు. ప్రజలను భయపెట్టి పథకాలు ఇవ్వమని చెప్పి బెదిరించి ఓట్లు వేయించుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. దేశంలో ఈ ఎన్నికకూ ఖర్చు చేయనంతగా కోట్లాది రూపాయలను టీఆర్ఎస్ వెచ్చించిందని కిషన్ రెడ్డి అన్నారు. అయినా ప్రజలు బీజేపీ పక్షాన నిలిచారన్నారు.కేవలం స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయామన్నారు. ఇక ఆట మొద లైందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించేదాకా విశ్రమించమన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను. అంతమొందిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
Palvai Sravanthi: పాల్వాయి స్రవంతి ప్రెస్ మీట్.. ఓటమిపై చర్చ?
