మునుగోడులో బీజేపీదే నైతిక విజయమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. 'ప్రలోభాలు, బెదిరింపులతో TRS గెలిచింది. సీఎం, మంత్రులు ఇంఛార్జ్ లుగా వ్యవహరించారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. డిపాజిట్ రాని స్థితి నుంచి రెండోస్థానంలోకి వచ్చామన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫలితాలపై కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఓటమికి గల కారణాలు, జరిగిన తప్పులపై చర్చించారు. కేవలం డబ్బు, మద్యం పంచి అధికారపార్టీ ఎన్నికల్లో విజయం సాధించిందని స్రవంతి ఆరోపిస్తున్నారు.
మునుగోడులో కేఏపాల్ హల్‌చల్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిశీలిస్తూ ముందుకు సాగారు. చౌటుప్పల్ పోలింగ్ కేంద్రాన్ని స్వతంత్ర అభ్యర్థి కే.ఏ.పాల్ సందర్శించారు. పరుగులు పెడుతూ కనిపించారు.